డబ్బుల కోసం దేనికైనా రెడీ అంటూ తనను తాను ‘సేల్’కు పెట్టుకునే క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు సాయిధరమ్ తేజ్. ఇప్పుడింకో సరికొత్త క్యారెక్టర్ లో కనిపించడానికి సిద్ధమవుతున్నాడు మెగా మేనల్లుడు. ‘పటాస్’ ఫేమ్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సాయిధరమ్ ‘సుప్రీమ్’ అనే సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. కళ్యాణ్ రామ్ - హరీష్ శంకర్ తదితరులు ఈ వేడుకలో పాల్గొని సాయికి శుభాకాంక్షలు చెప్పారు.
‘సుప్రీమ్’లో సాయిధరమ్ క్యాబ్ డ్రైవర్ గా కనిపించబోతుండటం విశేషం. అందుకే ఈ సినిమా ‘డోంట్ సౌండ్ హార్న్’ అనే క్యాప్షన్ కూడా పెట్టారు. మామూలుగా టాక్సీలపై ‘సౌండ్ హార్న్’ అని రాసి ఉంటుంది. మరి దానికి ఆపోజిట్ క్యాప్షన్ పెట్టడంలో ఉద్దేశమేంటో చూడాలి. సాయిధరమ్ మేనమామ చిరంజీవి ‘రౌడీ అల్లుడు’ సినిమాలో ఆటో డ్రైవర్ గా కనిపించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అల్లుడు క్యాబ్ డ్రైవర్ అవతారమెత్తుతున్నాడు. మరి అమలాపురం బుల్లోడా పాట రీమిక్స్ కూడా చేస్తాడేమో చూడాలి.
అక్టోబరు 5న ‘సుప్రీమ్’ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. దిల్ రాజు బేనర్ లో సాయికిది వరుసగా మూడో సినిమా కావడం విశేషం. దీంతో పాటు ఇదే బేనర్ లో సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ‘శతమానం భవతి’ అనే సినిమా కూడా చేయాల్సి ఉంది సాయిధరమ్.