సౌత్ ద‌ర్శ‌కుడేనా సౌత్ హీరో టైటిల్ నీ లేపేసిన ఖాన్!

Update: 2022-06-02 02:48 GMT
కింగ్ ఖాన్ షారూక్ ఒక సౌత్ ద‌ర్శ‌కుడిని ఎంపిక చేసుకుని ప్ర‌యోగం చేస్తుండ‌డం కొంత‌కాలంగా హాట్ టాపిక్ గా మారింది. హిందీ ద‌ర్శ‌కులు ఇవ్వ‌లేనిది అట్లీ ఏం ఇస్తున్నాడు? అన్న‌ది కూడా గుస‌గుస‌గా మారింది. కానీ అట్లీ అదేమీ ప‌ట్ట‌కుండా త‌న ప‌ని తాను చేసుకుపోతున్నాడు. ఖాన్ కి ఒక హిట్టివ్వాల‌ని త‌పిస్తున్నాడు.

అట్లీ సినిమాలో షారూఖ్- నయనతార జంట‌గా కనిపించనుండ‌డం కూడా హాట్ టాపిక్. ఈ మూవీ టైటిల్ ఇన్నాళ్లు స‌స్పెన్స్ గా మారింది.  ఇప్పుడు టైటిల్ కూడా లీక్ అయ్యింది. 'జవాన్' అనే టైటిల్ ని ఖాన్ - అట్లీ బృందం ఎంపిక చేసుకున్నార‌ని సమాచారం.

''ఈ చిత్రానికి జవాన్ అనే పేరు పెట్టారు. 1 నిమిషం 34 సెకన్ల నిడివి గల టీజర్ తో త్వరలో ప్రకటన చేస్తారు'' అని తెలిసింది. SRK అతని బృందం మ‌రికొద్ది రోజుల్లో ఈ చిత్రం టైటిల్ ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే తెలుగు హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ ఇప్ప‌టికే జ‌వాన్ టైటిల్ తో ఒక మూవీలో న‌టించిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు దానినే ఖాన్ ఎంపిక చేసుకోవ‌డం ఆసక్తిక‌రం.

ఈ సినిమాలో నయనతార ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా కనిపించనుండగా.. ఎస్‌.ఆర్‌.కె ద్విపాత్రాభినయం చేస్తున్నార‌ని సమాచారం. ఒక‌ పాత్ర లో గ్యాంగ్ స్టర్ కొడుకుగా కనిపిస్తాడని.. మరొకటి పాత్ర‌లో సీనియర్ RAW ఆఫీసర్ కం తండ్రి పాత్రలో క‌నిపిస్తాడ‌ని కూడా గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 1996లో 'హిందుస్థానీ'(భార‌తీయుడు)లో విశ్వ‌న‌టుడు కమల్ హాసన్ తండ్రిగా అలాగే కొడుకుగా నటించినట్లే ఇప్పుడు షారూక్ ప్ర‌యోగం చేస్తున్నారు. మేక‌ప్ కోసం అధునాత‌న‌ ప్రోస్తెటిక్స్ ని ఉపయోగిస్తున్నార‌ట‌.

జవాన్ లో షారుఖ్ ఖాన్ సరసన నయనతార తొలిసారి నటించనుంది. న‌య‌న్ తో పాటు ఈ చిత్రంలో సన్యా మల్హోత్రా కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తోంది. దాదాపు నాలుగు సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత షారూఖ్ ఖాన్ తిరిగి పెద్ద సంచ‌ల‌న విజ‌యంతో స‌త్తా చాటాల‌ని  చాలా ఉత్సాహంగా ఉన్నారు.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. ఖాన్ న‌టిస్తున్న‌ జవాన్ తో పాటు ప‌ఠాన్ మూవీ సెట్స్ పై ఉన్నాయి. ప‌ఠాన్ లో దీపికా పదుకొనే -జాన్ అబ్రహం కీల‌క పాత్ర‌ధారులు. YRF సంస్థ‌ నిర్మిస్తోంది. తాప్సీ పన్ను తో క‌లిసి రాజ్‌కుమార్ హిరాణీ 'డుంకీ'లో షారూక్ ఖాన్ న‌టించ‌నున్నారు.
Tags:    

Similar News