సుదీప్ ఏడేళ్ల శ్ర‌మ‌కి స‌ల్మాన్ ఖాన్ గ్రీన్ సిగ్నెల్!

Update: 2022-07-31 03:30 GMT
కిచ్చా సుదీప్ మ‌ల్టీట్యాలెంటెడ్ ప‌ర్స‌నాల్టీ. న‌టుడిగా..నిర్మాత‌గా..ర‌చ‌యిత‌గా..ద‌ర్శ‌కుడిగా..నేరెట‌ర్ గా సుదీప్ క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లో రాణిస్తున్నారు. న‌టుడిగా పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ద‌క్కించుకున్నారు. ఆరేడు చిత్రాలు స్వీయా నిర్మాణంలో తెర‌కెక్కించారు. అయితే న‌టుడిగా ఫేమ‌స్ అయినంత‌గా ద‌ర్శ‌కుడిగా ఖ్యాతికెక్క‌లేదు.

క‌న్న‌డ ప‌రిశ్ర‌మ‌లోనూ కెప్టెన్ బాద్య‌త‌లు వ‌హించారు. అయితే ఇప్పుడా ప్ర‌తిభ‌ని పాన్ ఇండియా స్థాయిలో చాట‌డానికి రెడీ అవుత‌న్నారు. ఏకంగా బాల‌వుడ్ స్టార్ హీరో స‌ల్మాన్ ఖాన్ ని డైరెక్ట్ చేసే అరుదైన అవ‌కాశమే అందుకున్నారు. ఈ విష‌యాన్ని సుదీప్ అధికారికంగా వెల్ల‌డించారు. అయితే స‌ల్మాన్ తో ఛాన్స్  అందుకోవ‌డం అన్న‌ది రాత్రికి రాత్రే జ‌రిగిన ప‌నికాదు.

అందుకోసం ఏకంగా ఏడాది పాటు సినిమా స్ర్కిప్ట్ పై ప‌నిచేసారు. అంత‌కు ముందు ఏడేళ్ల పాటు ప్ర‌య‌త్నం చేసారుట‌. అయితే గ‌త ఏడాదే స‌ల్మాన్  తో సినిమా చేయాల‌ట‌. కానీ స‌ల్మాన్ బిజీ షెడ్యూల్ కార‌ణంగా వీలుప‌డ‌లేద‌ని తెలిపారు. సుదీప్ క‌థ స‌ల్మాన్ కి బాగా న‌చ్చిందిట‌. తన నేరేష‌న్ ఎంతో బాగుంద‌ని మెచ్చకున్న‌ట్లు తెలిపారు. దీంతో సుదీప్ శ్ర‌మ‌కి ఎట్ట‌కేల‌కు ఫ‌లితం ద‌క్క‌బోతుంద‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం స‌ల్మాన్ లైన‌ప్ చూస్తే `క‌బీ ఈద్ క‌బీ దివాలీ` షూటింగ్ క్లైమాక్స్ లో ఉంది.  అలాగే `టైగ‌ర్ -3` చిత్రం షూటింగ్ పూర్తి చేసారు. షారుక్ ఖాన్ `ప‌ఠాన్` లో గెస్ట్ అప్పీరియ‌న్స్ ఇస్తున్నారు. మ‌రోవైపు మెగాస్టార్ చిరంజీవి న‌టిస్తోన్న `గాడ్ ఫాద‌ర్`  లోనూ కీల‌క పాత్ర పోషిస్తున్నారు.  

`వెద్ బాహు` అనే మ‌రాఠీ సినిమాలోనూ క్యామియో పోషిస్తున్నారు. ఈ సినిమాల‌కు సంబంధించి అన్ని ర‌కాల ప‌నులు పూర్త‌యిన త‌ర్వాత సుదీప్ ప్రాజెక్ట్ ని సెట్స్ కి తీసుకెళ్లే అవ‌కాశం ఉంది.

అలాగే సుదీప్ కూడా వేర్వేరు ప్రాజెక్ట్ ల‌తో బిజీగా ఉన్నారు. ఇటీవ‌లే ఆయ‌న హీరోగా న‌టించిన `విక్రాంత్ రోణా` ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా విక్రాంత్ రోణా భారీ అంచ‌నాల‌తో 3డీ పార్మాట్ లో  రిలీజ్ అయింది.  కొన్ని భాష‌ల్లో యావ‌రేజ్ టాక్ రాగా..మ‌రికొన్ని భాష‌ల్లో అంచ‌నాలు అందుకోవ‌డంలో విఫ‌ల‌మైంది. తెలుగులో `ఈగ‌`..`బాహుబ‌లి`.. `సైరా న‌ర‌సింహారెడ్డి` లాంటి ప్ర‌తిష్టాత్మ‌క చిత్రాల్లో సుదీప్ న‌టించిన సంగ‌తి తెలిసిందే. 
Tags:    

Similar News