సల్మాన్ ఖాన్-యూలియా వంతూర్ ల మధ్య వ్యవహారం చెడిందనే సంగతి అర్ధమవుతూనే ఉంది. సల్లూభాయ్ గురించి యూలియా ఇంటర్వ్యూలో(రొమేనియన్ న్యూస్ పేపర్) చెబుతోంది కానీ.. సల్మాన్ మాత్రం రిలేషన్ నుంచి పక్కకు తప్పుకున్నాడనే విషయాన్ని బాలీవుడ్ మీడియా చెబుతూనే ఉంది.
ఇప్పుడీ కండల వీరుడు మరో ఫారిన్ భామకు సెట్ అయ్యాడట. గత కొన్ని వారాలుగా రోబో సీక్వెల్ 2.0 హీరోయిన్ అమీ జాక్సన్ తో కలిసి తిరిగేస్తున్నాడట. ఇంతకు ముందే ఈ రూమర్ ఉంది కానీ.. రీసెంట్ గా జరిగిన 2.0 ఫస్ట్ లుక్ లాంఛ్ ఈవెంట్ లో ఈ విషయం చాలామందికి అర్ధమైంది. అమీ అడిగిందనే ఆ కార్యక్రమానికి వచ్చాడట సల్మాన్. పైగా స్టేజ్ మీద వాళ్లిద్దరు.. నవ్వులు.. కబుర్లు చెప్పుకోవడం చూసినోళ్లు చాలామంది అబ్బో అనేసుకున్నారు.
అసలు వీళ్లిద్దరికీ కొన్ని నెలలకు ముందు నుంచే క్లోజ్ అయ్యారట. సల్మాన్ సోదరుడు సోహైల్ ఖాన్ ఫ్రీకీ ఆలీ మూవీ తీసినప్పటి నుంచి ఉన్న పరిచయం.. అలా పెరిగిపోతోందని టాక్. రజినీ మూవీ ఈవెంట్ లో కూడా అమీని అందుకే ఆకాశానికి ఎత్తేసినట్లు తెలుస్తోంది. త్వరలో సల్మాన్- అమీ జాక్సన్ ల కాంబినేషన్ లో మూవీ అనౌన్స్ చేసేందుకు కూడా రెడీ అవుతున్నట్లు బాలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/