అదేంటో కాని.. మన దేశంలో ఒక చట్టం ఉంది. కోర్టు చెప్పిన తీర్పుపైన కామెంటు చేస్తే ఆ చట్టం ప్రయోగించవ్చు. సో.. కోర్టు ధిక్కారణ అనేది అసలు నేరం చేసిన వాడికంటే వాడి నేరం మీద కామెంట్ చేస్తే పడే పెద్ద పంచ్ అనమాట. అయినాసరే సినిమా హీరో సల్మాన్ ఖాన్ కేసులను చూశాక మాత్రం.. ఎవరైనా కూడా కామెంటు చేయలేకుండా ఉండిపోతున్నారు. అందుకే ఇప్పుడు సోషల్ నెట్వర్క్ పేజీల్లో మనోడు ట్రెండింగ్ అయిపోతున్నాడు.
1998లో నల్ల జింకలను కాల్చి చంపాడనే కేసు నుండి ఇవాళే విముక్తి పొందాడు సల్మాన్ ఖాన్. అలాగే 2002 కు చెందిన హిట్ అండ్ రన్ కేసులో కూడా ఆల్రెడీ దాదాపు విముక్తి పొందేశాడు. అప్పట్లో జింకలను చంపాడని చెప్పడానికి.. అసలు ''ప్రత్యక్ష సాక్షి'' ఎవరు లేకపోవడంతో.. మెటీరియలిస్టిక్ ఆధారాలు ఏమీ లేకపోవడంతో మనోడిపై కేసు కొట్టేసింది హై కోర్టు. ఇక తాగి కారు నడిపి ఒకర్ని చంపిన సంఘటన కూడా అంతే. సల్మాన్ బారులో తాగింతో క్రిస్టల్ క్లియర్ గా ఉన్న లిక్విడ్. అది వాటరా? వోడ్కానా? అనేది పోలీసులు అప్పట్లో ఋజువు చేసి నోట్ చేసుకోలేదు కాబట్టి.. ఆ కేసును కూడా కొట్టేశారు.
ఇలాంటి చిన్న చిన్న లాజిక్కులతో కేసును కొట్టేయడానికి 20 ఏళ్ళు కావాలా అంటూ జనాలు జోకులు వేస్తున్నారు. అంతే కాదు.. అసలు ఈ చిన్న లాజిక్ తో కేసును కొట్టేస్తారని తెలియక సల్మాన్ ఖాన్ లాయర్లకు ఇచ్చిన డబ్బులు లెక్కలు ఇప్పుడు 200 కోట్ల కలక్షన్ అయిపోయుండొచ్చనే జోకులు కూడా వినిపిస్తున్నాయి. సర్లేండి.. కోర్టు తీర్పునిచ్చింది.. మనం గౌరవించాలి. జై హింద్!!