వీడియో: జిమ్ లో కోడ‌లు కష్టం అంతా ఇంతా కాదు

Update: 2021-06-16 14:30 GMT
ఓవైపు సినిమాలు మ‌రోవైపు వెబ్ సిరీస్ లు వెబ్ షోల‌తో స‌మంత కెరీర్ జ‌ర్నీ విజ‌య‌వంతంగా సాగిపోతున్న సంగ‌తి తెలిసిందే. మ‌జిలీ-ఓ బేబి లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ల‌లో న‌టించిన స‌మంత `ఆహా`లో సామ్ జామ్ టాక్ షోని స‌క్సెస్ చేసింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ లో ఫ్యామిలీమ్యాన్ సీజ‌న్ 2లో న‌టించి మ‌రో సంచ‌ల‌న విజ‌యాన్ని ఖాతాలో వేసుకుంది.

తన లైఫ్ టైమ్ సినీకెరీర్ అంతా ఒకెత్తు అనుకుంటే.. ఫ్యామిలీమ్యాన్ 2 వెబ్ సిరీస్ ఒక్క‌టే ఒకెత్తు. ఈ సిరీస్ లో మ‌నోజ్ భాజ్ పాయ్ లాంటి సీనియ‌ర్ తో పోటీప‌డి న‌టించింది. త‌మిళ రెబ‌ల్ టైగ‌ర్ రాజీ పాత్ర‌లో సామ్ న‌ట‌న‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు కురిసాయి. ఇప్పుడు ఇదే ఉత్సాహంలో స‌మంత త‌దుప‌రి నెట్ ఫ్లిక్స్ సిరీస్ కి సంత‌కం చేసింద‌ని క‌థ‌నాలొచ్చాయి.

అయితే ఇంత బిజీ షెడ్యూళ్ల‌లోనూ స‌మంత త‌న ఫిట్నెస్ కోసం షెడ్యూల్ ని విడిచిపెట్ట‌దు. ఇదిగో వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా జిమ్ లో క‌స‌ర‌త్తులు చేస్తూ ప‌ర్ఫెక్ట్ ఫిట్ లుక్ ని మెయింటెయిన్ చేస్తోంది. అలా చేతుల‌పై ఆని ఒక చేత్తో డంబెల్ ఎత్త‌డం అంటే చాలా స్టామినా ఓపిక కావాలి. సామ్ ఎంత ప‌ర్ఫెక్ట్ గా ఉన్నారో దీనిని బ‌ట్టి అర్థ‌మ‌వుతోంది. కోడ‌లి క‌ష్టం ఫ‌లించి క్రేజు అమాంతం పాన్ ఇండియా రేంజుకు ఎదుగుతోంది. టైమ్స్ మోస్ట్ డిజైర‌బుల్ ఉమెన్ 2020 జాబితాలోనూ మెరిసింది సామ్. త‌దుప‌రి శాకుంత‌లంతో పాటు చైత‌న్య స‌ర‌స‌న ఓ సినిమాలో న‌టించేందుకు సామ్ రెడీ అవుతోంది.

https://twitter.com/HydTimes/status/1405066008692289539?s=1001
Tags:    

Similar News