ఆమె గర్భవతి. భర్తతో కలిసి ఇఫ్తార్ విందుకు వచ్చింది. కానీ అక్కడ ఊహించని సన్నివేశం అందరినీ షాక్ కి గురి చేసింది. గర్భిణి అయిన హీరోయిన్ బేబి బంప్ తో నడిచేందుకు చాలా ఇబ్బంది పడుతోంది. పది అడుగులకే అలసిపోతోంది. కానీ తన చేతిని అందుకుని భర్త హడావుడిగా తనను జనం నుంచి దూరంగా లాక్కెళ్లుతున్నాడు. ఈ దృశ్యం చూసిన నెటిజనులు సదరు భర్త దురుసుతనంపై భగభగ మండిపడుతున్నారు. ఇలాంటి చేదు అనుభవం ఎదురైంది ఎవరికి? అంటే.. నటి సనా ఖాన్ కి ఈ అనుభవం ఎదురైంది.
సనా ఖాన్ ఇంతకుముందు కింగ్ నాగార్జున నటించిన `గగనం`లో నటించారు. తెలుగు-తమిళం-హిందీలో పలు చిత్రాల్లో నటించారు. సల్మాన్ ఖాన్ లాంటి అగ్ర హీరో సరసనా సనా నటించింది. కానీ కెరీర్ లో అవకాశాలు తగ్గిన క్రమంలో ఇస్లామ్ లో చేరారు. అనంతరం ముఫ్తీ అనాస్ సయ్యద్ ని పెళ్లాడారు. ఈ జంట త్వరలో బిడ్డను ఆశిస్తున్నారు. ఆదివారం ముంబైలో బాబా సిద్ధిక్ ఇఫ్తార్ పార్టీకి హాజరైన క్రమంలో సనాఖాన్ వీడియో ఇంటర్నెట్ లో కనిపించింది. ఇది చూడగానే నెటిజనులు ఖంగు తిన్నారు. గర్భిణి అని కూడా చూడకుండా అతడు వేగంగా విందు ఆరగించేందుకు భార్యను లాక్కెళుతూ కనిపించాడు.
సనా ఖాన్ ఊపిరి పీల్చుకోలేని ధైన్యంలో కనిపించింది. తన భర్తను వారిస్తూ కేకలు వేస్తోంది. కానీ అవేవీ పట్టించుకోకుండా వెన్యూ లోపలికి ఆల్మోస్ట్ సనాను లాక్కెళ్లాడు. ఈ వీడియోలో సనా కొన్ని అడుగులు వడివడిగా వేసాక తీవ్రంగా అలసిపోయినట్లు కనిపించింది. అయినా ఆమె భర్త లోపలికి లాక్కెళ్లడం ఆపలేదు. ఈ వీడియో అంతర్జాలంలో క్షణాల్లో వైరల్ గా మారింది. అతడి ప్రవర్తనకు ప్రజలు తిట్టడం ప్రారంభించారు. ఈ వీడియో సనా ఖాన్ వరకూకు చేరడంతో ఆమె డ్యామేజ్ కంట్రోల్ మెసేజ్ తో అభిమానుల ముందుకు వచ్చింది.
త్వరగా లోపలికి వెళ్లమని కోరింది తానే అంటూ సనా పోస్ట్ చేసింది. తాజా ఇన్ స్టా పోస్ట్ లో సనా ఇలా రాసింది. ``ఈ వీడియో ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. ఇది నా ప్రియమైన సోదరులు సోదరీమణులందరికీ ... నిజానికి నాక్కూడా విచిత్రంగా కనిపిస్తోందని నాకు తెలుసు. మేము బయటికి వచ్చిన తర్వాత డ్రైవర్ కారు సహా ఏమయ్యాడో కనిపించలేదు. నేను అక్కడ చాలా ఎక్కువసేపు నిలబడి ఉన్నాను. చెమటలు పట్టడం వల్ల అసౌకర్యంగా అనిపించింది. అందువల్ల ఆయన (భర్త) నన్ను త్వరగా లోపలికి తీసుకువెళ్లాలనుకున్నాడు.

లోనికి వెళితే నేను కూర్చుని నీరు తాగి గాలిని శ్వాసించవచ్చు. అతిథులంతా మా ఫోటోలను క్లిక్ చేస్తూ వేడుకను డిస్టర్బ్ చేయకూడదనుకోవడంతో త్వరగా లోపలికి వెళ్దాం అని నేను అతనికి చెప్పాను. కాబట్టి కేవలం ఒక అభ్యర్థన ప్లీజ్... దీనిని వేరే విధంగా ఆలోచించవద్దు. మీ ఆందోళనకు మరోసారి ధన్యవాదాలు. ప్రతి ఒక్కరి ప్రేమకు ధన్యురాలిని`` అని సనా క్లారిటీనిచ్చే ప్రయత్నం చేసింది. బహుశా ఇఫ్తార్ విందుకు విచ్చేసిన భారీ జన సందోహం సెలబ్రిటీ అయిన సనాఖాన్ ని ఫోటోలు తీసేందుకు ఆత్ర పడడంతో అది ఇష్టం లేని భర్త అక్కడి నుంచి వడివడిగా తన భార్యను అలా లాక్కెళ్లాడని అర్థం చేసుకోవచ్చు.