సంజయ్ దత్ ని వదలని ప్రేమ జ్ఞాపకం

Update: 2018-04-09 09:36 GMT
జైలు జీవితం పూర్తి చేసుకుని వచ్చి ప్రశాంతంగా గడుపుతున్న సంజయ్ దత్ కు గతం తాలూకు జ్ఞాపకాలు చీకట్లు మాత్రం అంత సులభంగా వదలటం లేదు. తానుగా గుర్తుచేసుకోవడం లేదు కాని పరిస్థితులు మాత్రం దానికే ప్రేరేపిస్తున్నాయి. ఇటీవలే యాసిర్ ఉస్మాన్ అనే రచయిత ‘ది క్రేజీ అన్ టోల్డ్ స్టొరీ అఫ్ బాలీవుడ్ బ్యాడ్ బాయ్’ అనే పుస్తకం ఒకటి రాసాడు. సంజయ్ దత్ జీవితంలో లేనివి ఉన్నవి బాగా మసాలాలు దట్టించి అందులో పొందుపరిచాడు. ముంబై పేలుళ్లు మొదలుకొని అప్పటి కాలంలో హీరొయిన్ మాధురి దీక్షిత్ సంజయ్ దత్ ప్ర్రేమలో పడటం దాకా ఏవేవో అందులో పెట్టేసాడు. ఇది కాస్త వివాదాస్పదం కావడంతో ఒళ్ళు మండిన సంజయ్ దత్ తనను అడగకుండా రాయడమే కాక అన్ని అవాస్తవాలు రాసినట్టు ఆరోపించి లీగల్ చర్యలకు కూడా ఉపక్రమించాడు. తాను అధికారికంగా అనుమతి ఇచ్చింది రన్బీర్ సింగ్ హీరోగా వస్తున్న తన బయో పిక్ కు మాత్రమే అని పలు సందర్భాల్లో వ్యక్తం చేసాడు.

ఇక ఇప్పుడు మరో చికాకు పెట్టే విషయం సంజయ్ దత్ తలకు చుట్టుకుంది. సంజయ్ దత్ జైలు నుంచి బయటికి వచ్చాక స్వాతంత్య్రం రాక ముందు నేపధ్యాన్ని తీసుకుని అతను హీరోగా శ్రీదేవి హీరొయిన్ గా ఒక సినిమా ప్లాన్ చేసాడు కరణ్ జోహార్. అనుకోకుండా శ్రీదేవి చనిపోవడంతో ఆ పాత్రకు మాధురి దీక్షిత్ తో చేయించాలనే ప్లాన్ లో ఉన్నాడు కరణ్ జోహార్. మాధురి అంటే గిట్టని సంజయ్ దత్ అదే కనక జరిగితే ఆ ప్రాజెక్ట్ నుంచే బయటికి రావాలని నిర్ణయం తీసుకున్నాడట. హీరొయిన్ పాత్రకు చాలా ఇంపార్టెన్స్ ఉండటంతో పాటు సీనియర్ నటే కావలసి ఉండటంతో సంజయ్ దత్ కనక డ్రాప్ అయితే ఆ స్థానంలో అనిల్ కపూర్ ని రీ ప్లేస్ చేసే ఆలోచనలో కూడా ఉన్నాడు కరణ్.

కొసమెరుపు ఏంటంటే ఇటీవలే గోవాలో జరిగిన ఒక స్టార్ క్రికెట్ మ్యాచ్ లో సంజయ్ దత్ ను ఒక మీడియా జర్నలిస్ట్ మాధురి దీక్షిత్ తో సినిమా చేయబోతున్నారటగా అని అడిగితే కోపంతో సంజయ్ పక్కకు వెళ్ళిపోవడం బాగా వైరల్ అయ్యింది. సో తనతో ఎట్టి పరిస్థితుల్లో నటించే అవకాశం లేదని క్లారిటీ వచ్చినట్టే. మహాకవులు ఊరికే రాయలేదు గతం తాలుకు నీడలు అంత సులభంగా వదలవని. సంజయ్ దత్ విషయంలో ప్రూవ్ అయ్యిందిగా.

వీడియో చూడటానికి క్లిక్ చేయండి

Full View
Tags:    

Similar News