ఈ సంక్రాంతికి విడుదలైన రెండు ల్యాండ్ మార్క్ చిత్రాలు విజయవంతం కావడంతో తెలుగు సినీ ప్రియులందరూ అమితానందంలో వున్నారు. అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర క్రేజ్ కి చిరునామాగా నిలిచినా ఖైదీ 150 - కంటెంట్ కి ప్రతీకగా నిలిచిన శాతకర్ణి సినిమాల విజయాలు డైరెక్ట్ గా కాకపోయినా ఇన్ డైరెక్ట్ గా ఒక సినిమాపై ప్రభావం చూపించనున్నాయి. అదే బాహుబలి రెండో వెర్షన్.
ఇప్పటివరకూ బాహుబలి పేరిట వున్న డే 1 - వీక్ 1 రికార్డులని దాదాపు 70శాతం చిరు తుడిచిపెట్టేశాడు. ఫుల్ రన్ లో బాహుబలికి పోటీలేకపోయినా ఒక సాధారణ సినిమా నుండి ఇది ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. కాబట్టి రెండో బాహుబలి ఇప్పుడు చాలా చోట ఖైదీ రికార్డులని బ్రేక్ చెయ్యాల్సివుంది.
ఇక ఏళ్ళకు ఏళ్ళు తీసుకుని సినిమా తీర్చిదిద్దిన విధానంకంటే క్రిష్ శాతకర్ణిపై ప్రదర్శించిన వేగమే అందరినీ మెప్పించింది. బాహుబలి టైం కి శాతకర్ణి లేదు కాబట్టి పోలికలేదు. ఇప్పుడు రెండో బాహుబలికి తప్పకుండా పోలిక చూపించే అవాకాశాలు వున్నందున జక్కన్న ఏ విధంగా ప్రణాళికలు రచిస్తాడో చూడాలి. వీటన్నిటినీ అధిగమించాలంటే మొదటిభాగంలో భయంకరంగా కలిసొచ్చిన ప్రమోషన్ ఐడియాలు ఇప్పుడు రెండో భాగానికి కూడా ఎంత త్వరగా మొదలుపెడితే అంత మంచిది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/