లక్ అంటే ఈ 'మినీ' హీరోదే

Update: 2021-06-11 07:39 GMT
తను నేను సినిమాతో హీరోగా పరిచయం అయిన దివంగత దర్శకుడు శోభన్‌ తనయుడు సంతోష్‌ శోభన్‌ కు ఇన్నాళ్లకు దశ తిరిగినట్లయ్యింది. 2015 లో మొదటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ యువ హీరో ఇన్నాళ్ల తర్వాత బిజీ అయ్యాడు. ఇటీవల యూవీ క్రియేషన్స్‌ బ్యానర్‌ లో వచ్చిన ఏక్‌ మినీ కథ సినిమా కు మంచి స్పందన వచ్చింది. నటుడిగా సంతోష్‌ మంచి మార్కులను దక్కించుకున్నాడు. అందుకే ఆయన మరిన్ని సినిమా ఆఫర్లు దక్కించుకున్నాడు. ఇప్పటికి ఇప్పుడు ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. మరో రెండు మూడు చర్చల దశలో ఉన్నాయి.

ప్రస్తుతం యూత్‌ ఆడియన్స్‌ లో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడు మారుతి. యూవీ క్రియేషన్స్‌ వారు మారుతి దర్శకత్వంలో సంతోష్‌ శోభన్ హీరోగా ఒక సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్‌ ప్రారంభం అయిన ఈ సినిమా ను కేవలం నెలన్నర రోజుల్లో ముగించేయబోతున్నట్లుగా చెబుతున్నారు. ఇదే ఏడాది లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. సంతోష్‌ కెరీర్‌ పై ప్రభాస్ ప్రత్యేక శ్రద్దను కనబర్చుతున్నాడు. తన వర్షం సినిమాకు దర్శకుడు అయిన శోభన్‌ తనయుడు సంతోష్‌ అవ్వడం వల్ల ప్రభాస్‌ ప్రత్యేక కేర్‌ అనే విషయం అందరికి తెల్సిందే.

రామ్‌ చరణ్‌ మరియు ప్రభాస్‌ లు ఏక్ మినీ కథ సినిమాకు ప్రమోటర్స్ గా వ్యవహరించారు. ఇద్దరు సినిమాను ప్రమోట్ చేసి హీరో స్థాయిని పెంచారు. దాంతో ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మారుతి దర్శకత్వంలోనే కాకుండా నందిని రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమాను కూడా సంతోష్‌ చేస్తున్నాడు. బడా నిర్మాతలు మరియు పెద్ద దర్శకులు ట్యాలెంటెడ్‌ డైరెక్టర్స్ సంతోష్‌ కు పిలిచి మరీ ఆఫర్లు ఇస్తున్న ఈ సమయంలో లక్ అంటే సంతోష్‌ దే అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.
Tags:    

Similar News