కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన తొలి మూవీ సప్తగిరి ఎక్స్ ప్రెస్.. రేపు(డిసెంబర్ 23) థియేటర్లలోకి రానుంది. ఈ మూవీ ఆడియో లాంఛ్ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హాజరు కావడంతో.. ఒక్కసారిగా ఈ మూవీపై బజ్ ఆకాశానికి చేరిపోయింది. ఆడియో ఫంక్షన్ స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టేసుకున్న సప్తగిరి.. ఇప్పుడు ప్రమోషన్స్ లో కూడా పవన్ నామ జపం చేస్తూనే ఉన్నాడు.
'పవన్ పాడారనే కాటమరాయుడు టైటిల్ పెట్టుకున్నాం. శరత్ మరార్ అడిగేసరిగి మెగాభిమానిగా కాదనలేక పోయాను. ఆ నిమిషంలో మా యూనిట్ లో ఆనందం.. అలజడి.. అన్నీ చెలరేగాయి. పవర్ స్టార్ గొప్పదనం ఏంటంటే.. 70 శాతం సినిమా కంప్లీట్ అయ్యాక కూడా.. టైటిల్ ఇచ్చేశామనే కృతజ్ఞతతో.. తను మాకు ఉపయోగపడాలనే ఉద్దేశ్యంతో వచ్చారు. గంట సేపు మాతో ఉండడమే కాదు. నా సినిమాలే నేను చూసుకోను.. సప్తగిరి ఎక్స్ ప్రెస్ చూస్తాననేసరికి ఆనందం ఎక్కువైపోయింది' అన్నాడు సప్తగిరి.
అయితే పవన్ కళ్యాణ్ ఈ ఈవెంట్ కి వచ్చాక భయం కూడా పెరిగిపోయిందట. 'ఆయన మా ఫంక్షన్ కి వచ్చాక పెరిగిన వైబ్ ని అందుకోగలమా లేదా అనిపించింది. అందుకే మళ్లీ సినిమాని చెక్ చేసుకున్నాం. మా మూవీకి పవర్ అక్కడి నుంచే మొదలైంది. ఇక టైటిల్స్ గా కోనేటిరాయుడు.. తో చాలానే అనుకున్నాం. నేమ్ ప్లేట్ తో సహా అన్నీ మార్చాల్సి ఉంటుంది కదా. నేను కమెడియన్ గా సక్సెస్ సాధించిన మూవీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్.. ఆతర్వాత ఎక్స్ ప్రెస్ రాజా.. అందుకే సెంటిమెంట్ గా సప్తగిరి ఎక్స్ ప్రెస్ టైటిల్ పెట్టాం. అందరినీ పిలిచి రీ డబ్బింగ్ చేయించాం. కొంత ఖర్చు అయినా.. పవన్ కళ్యాణ్ కారణంగా మా సినిమాకు జరిగిన మేలుతో పోల్చితే.. మేం చేసిన ఆ ఖర్చు చాలా చిన్న విషయం' అంటున్న సప్తగిరి.. పవన్ ఫ్యాన్స్ నుంచి వస్తున్న సపోర్ట్ కి ఉబ్బితబ్బిబ్బవుతున్నట్లు చెబుతున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/