కమెడియన్స్ హీరోలు అయిపోవడం తెలుగు ఇండస్ట్రీలో ఎప్పట్నుంచో ఉంది. అయితే ఆ తర్వాత నిలదొక్కోవడమే అసలు సమస్యంతా. అప్పటి రేలంగి నుంచి ఇప్పుడు శ్రీనివాస రెడ్డి.. సప్తగిరి వరకూ ప్రతీ కమెడియన్ ఏదో ఒకటైంలో హీరోగా ప్రయత్నించిన వారే. గతం వదిలేస్తే ఈ మధ్య కాలంలో మాత్రం హీరోగా టర్న్ అయిన కమెడియన్స్ ఆడియెన్స్ ని పెద్దగా మెప్పించలేకపోయారు. అందుకే ఇప్పుడు అందరి కళ్లూ సప్తగిరి మీదే ఉన్నాయ్.
అయితే సప్తగిరి కన్నా ముందు కామెడీ కింగ్ బ్రహ్మానందం, అంతకు ముందు కోట శ్రీనివాసరావు, మధ్యలో అలీ, రీసెంట్ గా సునీల్.. మొన్నటికి మొన్న ధన్ రాజ్, వెన్నెల కిషోర్ ఇలా కితకితలు పెట్టడంలో తమకంటూ ఐడెంటిటీ తెచ్చుకొన్న కమెడియన్సందరూ హీరోగాట్రై చేసినవాళ్లే. వీళ్లలో అలీ, సునీల్ మాత్రమే హీరోలుగా హిట్స్ కొట్టారు. మిగిలిన వాళ్లు మాత్రం ఫ్లాప్ కాజా తినేశారు. ఆ తర్వాత అలీ కూడా మళ్లీ కామెడీ వైపు వచ్చేస్తే.. సునీల్ మాత్రం ఇంకా హీరో అనిపించుకోడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మరి సప్తగిరి ఫేట్ ఎలా ఉండబోతుంది? హిట్ కొడితే హీరోగా ఫిక్సైపోతాడా? లేకపోతే కమెడియన్ గా ఎంటర్ టైన్ చేస్తాడా చూడాలి.
అసలు మొన్నటివరకు 'సప్తగిరి ఎక్స్ ప్రెస్ ను ఎవరూ పట్టించుకోలేదు కానీ.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వచ్చి ఆడియో రిలీజ్ చేయగానే సినిమా మీద ఒక్కసారిగా బజ్ వచ్చేసింది. ట్రైలర్ కూడా ఇంప్రెసివ్ గా ఉండటంతో సప్తగిరికి కూడా తన సినిమా మీద ఎక్కడలేని కాన్ఫిడెన్స్ కనిపిస్తోంది. హిట్ కొడతానని ధీమాగా ఉన్నాడు. కాని ట్రేడ్ వర్గాలు మాత్రం అదిగో జయమ్ము నిశ్చయమ్మురా చూడు.. శ్రీనివాస్ రెడ్డిని చూడు.. అంటున్నారు.