స్టార్ కిడ్ సూట్ కేసులు మోసిందేంటి?

Update: 2019-08-06 13:21 GMT
ప్చ్! స్టార్ డాట‌ర్ ల‌గేజ్ మోయ‌డ‌మేంటి?  పైగా ఒక‌టి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు సూట్ కేసులు ఒక‌దానిపై ఒక‌టి పెట్టుకుని మ‌రీ మోసింది?  ఇంత‌కీ ఎవ‌రా స్టార్ కిడ్?  ఎందుకా క‌ష్టం అంటారా? అయితే వివ‌రాల్లోకి వెళ్లాలి.

బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ కుమార్తె .. న‌వ‌త‌రం క‌థానాయిక సారా అలీఖాన్ ఊహించ‌ని స‌ర్ ప్రైజ్ ని ఇచ్చింది. అది కూడా కెమెరా క‌ళ్లు వెంటాడే ముంబై విమానాశ్ర‌యంలో అమ్మ‌డు ఎలాంటి భేష‌జం లేకుండా ఓ ట్రాలీ లో ల‌గేజ్ ని వేసుకుని కార్ వ‌ద్ద‌కు వ‌చ్చింది. ఓవైపు అక్క‌డ ప‌ని వాళ్లు సాయం చేస్తామ‌ని ముందుకొచ్చినా అదేమీ ప‌ట్టించుకోకుండా త‌న‌కు తానుగానే సూట్ కేసుల్ని ఒక‌దానిపై ఒక‌టి గా ల‌గేజ్ ట్రాలీలో స‌ర్ధుకుని దానిని టీవిగా న‌డిపించింది. ఆ మొత్తం దృశ్యం చూస్తున్న‌వాళ్ల‌కు ఔరా! ఇది నిజంగానే ఒక బాలీవుడ్ స్టార్ చేస్తున్న ప‌నేనా?  అస‌లు మా క‌ళ్ల‌ను మేమే న‌మ్మ‌లేక‌పోతున్నాం! అంటూ షాక‌య్యారు.

కొంద‌రు అభిమానులు అయితే సారా చేసిన ఈ ప‌నికి సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. ఎదిగే వ‌య‌సులో ఒదిగి ఉండ‌డం అంటే ఇదే! అంటూ ఓ అభిమాని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ఈ సింప్లిసిటీ నిన్ను ఎంతో ఎత్తుకు తీసుకెళుతుంది! అంటూ వేరొక వీరాభిమాని పొగిడేశాడు. బాలీవుడ్ స్టార్లు ఎవ‌రూ ఇలా త‌మ ల‌గేజ్ ని తాము మోసినట్టుగా నేనెప్పుడూ చూడ‌లేడు! అంటూ వేరొక ఫ్యాన్ ఫిదా అయిపోయాడు. మొత్తానికి సారా ఒకే ఒక్క ఎపిసోడ్ తో ఎన్నో మ‌న‌సులు కొల్ల‌గొట్టింది. సారా ప్ర‌స్తుతం కార్తీక్ ఆర్య‌న్ స‌ర‌స‌న ఓ చిత్రంలో న‌టిస్తోంది. ల‌క్నోలో షెడ్యూల్ పూర్తి చేసుకుని ముంబై విమానాశ్రయంలో దిగిన‌ప్ప‌టి స‌న్నివేశ‌మిది.



Tags:    

Similar News