మెగా-నందమూరి అభిమానుల మధ్య వైరం ఈనాటిది కాదు. ఈ రెండు ఫ్యామిలీల హీరోలు బాగానే ఉంటారు కానీ అభిమానులు మాత్రం పరస్పరం విషం కక్కుతుంటారు. ఐతే అప్పుడప్పుడూ అభిమానుల మధ్య అంతరాన్ని మరింత పెంచేలా సినిమాల్లో కొన్ని సన్నివేశాలు పెడుతుంటారు. అప్పట్లో బాలయ్య ‘సింహా’ సినిమాలో పేల్చిన కొన్ని డైలాగులు మెగా ఫ్యామిలీ హీరోలను ఉద్దేశించే అన్న ఆరోపణలు వచ్చాయి. అలాగే ‘రచ్చ’ సినిమాలో రామ్ చరణ్ వేసిన ఒక పంచ్ నందమూరి హీరోల్ని టార్గెట్ చేసుకున్నదే అన్న చర్చ జరిగింది. ఐతే ఈ మధ్య ఇలాంటివి తగ్గిపోయాయి. రెండు ఫ్యామిలీల హీరోలు స్నేహంగా ఉంటున్నారు. సినిమాల్లో కూడా ఎలాంటి అభ్యంతరక సన్నివేశాలు.. డైలాగులు ఉండట్లేదు.
ఐతే అల్లు శిరీష్ హీరోగా నటించిన కొత్త సినిమా ‘ఒక్క క్షణం’ ఒక సీన్ మాత్రం మాత్రం కొంత చర్చనీయాంశమవుతోంది. ఈ సినిమాలో ఒక సీన్లో చమ్మక్ చంద్ర ట్రాఫిక్ కానిస్టేబుల్ గా కనిపిస్తాడు. అతను రోడ్డు మీద డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుంటాడు. ఒక వ్యక్తి తాగి వచ్చి ‘‘ఐ హ్యావ్ 108 ఫీవర్..’ అంటూ ‘పైసా వసూల్’ సినిమాలో బాలయ్య స్టయిల్లో మామా ఏక్ పెగ్ లా పాట అందుకునే ప్రయత్నం చేస్తాడు. ఆ వ్యక్తిని చితకబాది పోలీస్ జీప్ ఎక్కిస్తాడు చంద్ర. దీనిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. బాలయ్యను లక్ష్యంగా చేసుకుని కావాలనే ఈ సీన్ పెట్టారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సినిమాలో మెగా హీరోల రెఫరెన్సులు చాలా ఉండేసరికి.. ఇది కూడా ఉద్దేశపూర్వకంగా పెట్టిన సీనేనా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మరి దీనిపై చిత్ర బృందం వెర్షన్ ఏంటో?