ల‌క్ష‌ల మంది భ‌విష్య‌త్ వెనుక షాడో హీరో!

Update: 2022-03-25 08:30 GMT
కోలీవుడ్ స్టార్ విజ‌య్ సేతుప‌తి ఇమేజ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. న‌టుడిగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపుని ద‌క్కించుకున్నారు. విశ్వ‌న‌టుడు క‌మ‌ల్ హాసన్ త‌ర్వాత అంత‌టి గొప్ప స్థానం సేతుప‌తికి ఉంటుంద‌ని ఆయ‌న న‌ట జీవితమే నిరూపిస్తుంది. విజయ్ సేతుప‌తి ఎంపిక చేసుకునే క‌థ‌లు..పాత్ర‌లు మాత్ర‌మే అంత‌టి ఘ‌న‌కీర్తిని క‌ట్ట‌బెట్టాయ‌న్న‌ది వాస్త‌వం.

ప‌రిపూర్ణ న‌టుడు అన్న పదానికి ప‌ర్పెక్ట్ ఛాయిస్ అత‌ను. రంగంల ప్ర‌పంచంలో రాణించాలంటే గ్లామ‌ర్ ఒక్క‌టుంటే స‌రిపోదు అంత‌కు మించి ప్ర‌తిభ అన్న దానికి అభిమానులు ముద్దుగా పిల‌చుకునే  మ‌క్క‌ల‌ర్ సెల్వ‌న్ ని  స్ఫూర్తిగా చెప్పొచ్చు.

అత‌ను తెర‌మీద‌నే కాదు..తెర వెనుక రియ‌ల్ హీరో నిరూపించిన ఘ‌ట‌న ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. విజ‌య్ సేతుప‌తిలో సేవాభావం కూడా ఎక్కువేన‌ని తెలుస్తోంది. ఆపన్న హ‌స్తం అందించ‌డంలో   విజ‌య్ ముందుంటారు? అన‌డానికి స‌జీవ సాక్ష్యాలున్నాయి. పాండిచ్చేరి వేదిక‌గా ఓ స్వ‌చ్ఛంద సంస్థ‌ని నిర్వ‌హిస్తున్న వీర‌రాఘ‌వ‌న్ ఈ షాడో హీరో సేవాభావాన్ని తాజాగా  బ‌య‌ట పెట్టారు.

ఉపాధి..ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించ‌డంలో విజ‌య్ సేతుప‌తి చొర‌వ అసాధార‌ణ‌మ‌ని కొనియాడారు. ఆయ‌న స‌హ‌కారంతోనే పాండిచ్చేరి ఛారిటీ కార్య‌క్ర‌మాలు నిర్విరామంగా కొన సాగుతున్నాయ‌న్నారు. ఉద్యోగాల క‌ల్ప‌న కోసం విజ‌య్ సేతుప‌తి స్వ‌యంగా త‌నతో ఒక ఆఫీస్ ఏర్పాటు చేయించి వెనుకుండి న‌డిపించార‌న్నారు.

విజ‌య్ అందించిన స‌హాయంతో  ఎంతో మంది త‌మిళ‌నాడు యువ‌త‌కి ల‌క్ష‌ల్లో ఉద్యోగాలు క‌ల్పించామ‌న్నారు. అయితే ఈ విష‌యాన్ని ఎక్క‌డా రివీల్ చేయోద్ద‌ని ప్రామిస్ తీసుకున్నారు. అందుకే ఇన్నాళ్లు ఈ విష‌యాలు ఎక్క‌డా చెప్ప‌లేద‌ని వీర‌రాఘ‌వ‌న్ తెలిపారు. దీంతో విజ‌య్ అభిమానులు సోష‌ల్ మీడియా వేదిక‌గా గ్రేట్ స‌ర్ అంటూ  ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. నిరుద్యోగుల‌కు ఉద్యోగాల క‌ల్ప‌న లో విజ‌య్ తీసుకుంటున్న శ్ర‌ద్ద‌కి అభిమానులు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు.

వీర రాఘ‌వ‌న్  2016 నుంచి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దీనిలో  భాగంగా నిరుద్యోగులకు ఉద్యోగ అవ‌కాశాలు కల్పిస్తున్నారు. 2019లో సన్‌ టీవీ నిర్వహిస్తున్న ఓ కార్యక్రమం ద్వారా విజయ్‌ సేతుపతి- వీర‌రాఘ‌వ‌న్ ని క‌లిసారు.  అప్ప‌ట నుంచి ఇద్ద‌రు క‌లిసి ప్ర‌యాణం చేస్తున్నారు. అయితే సేవా కార్య‌క్ర‌మాల వెనుకుండి వీర రాఘ‌వ‌న్ ని ముందుకు న‌డిపించేది విజయ్ సేతుప‌తి. ఆయ‌న కార‌ణంగానే ల‌క్ష‌ల మందికి ఉపాధి సాధ్య‌మైంద‌ని  తెలుస్తోంది.
Tags:    

Similar News