ఇంటి పనితో పాటు బట్టలు ఉతికిన బాలీవుడ్‌ బాద్‌ షా

Update: 2022-12-21 02:30 GMT
బాలీవుడ్‌ బాద్ షా షారుఖ్‌ ఖాన్‌ గత చిత్రం జీరో వచ్చి చాలా కాలం అయ్యింది. ఆ సినిమా తో పాటు అంతకు ముందు వచ్చిన సినిమాలన్నీ కూడా బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. కాస్త బోల్డ్‌ గా చెప్పాలంటే పదేళ్లుగా షారుఖ్ ఖాన్ కి సక్సెస్ అనేదే లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో ఆయన నటించిన పఠాన్ సినిమా విడుదలకు సిద్ధం అయ్యింది.

జనవరి 25వ తారీకున బాలీవుడ్ బాద్ షా 'పఠాన్‌' సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. సినిమా ప్రమోషన్‌ లో భాగంగా పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్న షారుఖ్ ఖాన్‌ సినిమా కోసం పడ్డ కష్టంను తెలియజేయడంతో పాటు.. పఠాన్ యొక్క ప్రత్యేకతలను మరియు వివాదాలను గురించి మాట్లాడుతూ ఉన్నాడు.

తాజాగా షారుఖ్ ఖాన్‌ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన ఫిజిక్ గురించి వ్యాఖ్యలు చేశాడు. తన సిక్స్ ప్యాక్ బాడీ కోసం కాస్త ఎక్కువ శారీరక శ్రమ పడాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. కరోనా సమయంలో పిల్లలతోనే ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది. ఆ సమయంలో నేను చేసేది లేక ఎక్కువ సమయం వర్కౌట్స్ చేశాను.

మేము అంతా కూడా ఇంట్లో ఉండి తాళం వేసుకున్నాం. అందువల్ల ఎక్కువ సమయం జీమ్‌ కు కేటాయించే అవకాశం దక్కింది. ఇంట్లో ఉన్న సమయంలో ఇంటి పనులు చేయడంతో పాటు బట్టలు కూడా ఉతికాను.

కిచెన్‌ లో కూడా సాధ్యం అయినంత ఎక్కువ సమయం ఉండేవాడిని అన్నాడు. పిల్లలతో సమయం గడిపిన సమయంలో ఇంటి పనులు చేశానని షారుఖ్‌ ఖాన్ చెప్పుకొచ్చాడు.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో రూపొందిన పఠాన్ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. షారుఖ్ ఖాన్‌ కు జోడీగా ఈ సినిమాలో దీపికా పదుకునే నటించిన విషయం తెల్సిందే. తాజాగా విడుదల అయిన ఒక పాట వివాదాస్పదం అయ్యింది. వివాదం కారణంగా పఠాన్‌ కి మంచి పబ్లిసిటీ అయితే దక్కింది. హిందీ తో పాటు తెలుగు లో కూడా విడుదల కాబోతున్న పఠాన్‌ ఫలితం ఏంటో చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News