తమిళ్ లో గత ఏడాది విడుదలైన విక్రం వేదా అక్కడ ఎంత సంచలన విజయం సాధించిందో తెలిసిందే. ఐఎండిబి లాంటి వోటింగ్ సైట్స్ లో బాహుబలిని దాటేసి మరీ ప్రేక్షకుల మనసులు గెలుచుకున్న ఈ మూవీలో విలన్ గా విజయ్ సేతుపతి హీరోగా మాధవన్ నటన పీక్స్ లో ఉంటుంది. విక్రం వేదా బలం అదే. తెలుగులో వెంకటేష్ రానా కాంబోలో తీయాలనే ప్రయత్నాలు జరిగినట్టుగా వార్తలు షికారు చేసాయి కాని కార్యరూపం దాల్చలేదు. అసలు ఉంటుందో లేదో కూడా క్లారిటీ లేదు. కాని హిందీలో మాత్రం దీనికి చకచక అడుగులు పడిపోతున్నాయి. తమిళ్ లో భార్య భర్తలు పుష్కర్-గాయత్రి దర్శకత్వం వహించగా హింది వెర్షన్ బాధ్యతను నీరజ్ పాండే తీసుకోబోతున్నాడు. ఎ వెడ్నెస్ డే-బేబీ- ధోని లాంటి విభిన్నమైన చిత్రాలను టేకప్ చేసిన ఇతనే రైట్ ఛాయస్ అని చెప్పొచ్చు.
అసలైన విశేషం మరొకటి ఉంది. నెగటివ్ షేడ్స్ ఉన్న విజయ్ సేతుపతి పాత్రను హిందిలో షారుఖ్ ఖాన్ చేయబోతున్నాడు. మాధవన్ పాత్రలో మాత్రం మార్పు లేదు. తను హింది ప్రేక్షకులకు కూడా బాగా పరిచయం కాబట్టి ఇంకెవరి గురించి ఆలోచించలేదు. త్రీ ఇడియట్స్ మొదలుకుని ఈ మధ్యే అమెజాన్ ప్రైమ్ లో వచ్చిన బ్రీత్ వెబ్ సిరీస్ దాకా మాధవన్ అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకుంటూనే ఉన్నాడు. అందుకే మాధవన్ నే తీసుకున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. విక్రం వేదాలో విజయ్ సేతుపతి పాత్రను షారుఖ్ ఒప్పుకోవడం ఆశ్చర్యం కలిగించే విషయం. నిజానికి అది విలన్ పాత్ర కాదు. పరిస్థితుల ప్రభావం వల్ల క్రూరంగా మారిపోయి ఉంటుంది. అతన్ని పట్టుకునే పోలీస్ ఆఫీసర్ పాత్రే మాధవన్ ది. టైటిల్ అదే ఉంచుతారా లేక మార్చుతారా అనే క్లారిటీ ఇంకా రావాల్సి ఉంది. ఇంత మంచి సినిమాను తెలుగులో రీమేక్ చేయకపోయినా ఓకే కాని కనీసం డబ్బింగ్ అయినా వదిలి ఉంటే బాగుండేది అంటున్నారు సినిమా లవర్స్