అవార్డ్ ఇస్తున్నాం అని పిలిచి ఇవ్వకపోతే ఆ హీరో ఈగో హర్టవ్వదూ? ఆ అవార్డు వేడుకలో తనకు ఎదురైన అవమానానికి సదరు హీరో లోలోన రగిలిపోతున్నాడట. ఇంతకీ ఎవరా హీరో? అవార్డ్ ఇస్తామని పిలిచి ఎందుకు ఝలక్ ఇచ్చారు? అన్నది తెలియాలంటే డీప్ గా మ్యాటర్ లోకి వెళ్లాల్సిందే.
ఇటీవలే బాలీవుడ్ లో 2019 అవార్డ్స్ పేరుతో భారీ ఈవెంట్ జరిగింది. ఈ వేదికపై ఓ స్టార్ హీరోకు బెస్ట్ యాక్టర్ అవార్డ్ ఇస్తున్నామని లీక్ చేసిన కమిటీ ఆ తరువాత ఆ ఆలోచనను విరమించుకుంది. దాంతో సదరు హీరో అవార్డు రాలేదని కోపంతో రగిలిపోయాడట. ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ కబీర్ సింగ్ షాహిద్ కపూర్. తెలుగులో సంచలన విజయం సాధించిన `అర్జున్‌రెడ్డి` చిత్రాన్ని షాహిద్ కపూర్ హీరోగా సందీప్ వంగా రీమేక్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం అందుకుని దాదాపు 250 కోట్లు వసూళ్లతో షాహీద్ కపూర్ కెరీర్ నే మలుపు తిప్పింది. ఈ సినిమా తరువాత షాహీద్ క్రేజ్ అమాంతం రెట్టింపైంది. రెమ్యునరేషన్ ని కూడా భారీ స్థాయిలో పెంచేశాడు. అయితే ఈ క్రేజ్ లో వున్న షాహిద్ ని ఇటీవల ముంబైలో జరిగిన ఓ అవార్డు వేడుకలో తీవ్రంగా అవమానించారు. ఆ వేదికపై ఓ స్పెషల్ నంబర్ కు డ్యాన్స్ చేయమని సదరు అవార్డు ఆర్టనైజింగ్ కమిటీ షాహిద్ ని కోరిందట. దానికి అతడు సానుకూలంగా స్పందించి డ్యాన్స్ నంబర్ పెర్ఫామ్ చేయడానికి అంగీకరించాడట.
ఈ వేదికపై షాహిద్ కపూర్ కు బెస్ట్ యాక్టర్ అవార్డుని ఇవ్వాలని భావించిన అవార్డు ఆర్గనైజర్స్ చివరి నిమిషంలో ఆ ఆలోచనను విరమించుకున్నారు. దాంతో చిర్రెత్తుకొచ్చిన షాహిద్ డ్యాన్స్ చేయడానికి నిరాకరించాడని.. ఆ సమయంలో వారిపై కోపంతో రగిలిపోయాడని బాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. అయితే ఆ స్థానంలో వరుణ్ ధావణ్ తను నటిస్తున్న సినిమా షూటింగ్ కి బ్రేకిచ్చి మరీ అవార్డు వేడుకలో డ్యాన్స్ చేశాడట. పిలిచి అవమానిస్తే ఎవరికైనా మండుతుంది. అందునా షాహిద్ లాంటి సీనియర్ ని అవమానించడం సరైనదేనా?