కేవలం తమిళ ప్రేక్షకులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘2.ఓ’. శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా అక్షయ్ కుమార్ విలన్ గా ఎమీజాక్సన్ హీరోయిన్ గా తమిళంలో రూపొందిన ఈ చిత్రం పలు ఇండియన్ భాషల్లో విడుదలకు సిద్దం అవుతుంది. ముఖ్యంగా తెలుగు - హిందీ - మలయాళంలో డబ్ చేసి భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. దాదాపు మూడు సంవత్సరాలుగా ఈ చిత్రం కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తూనే ఉన్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ ఈ చిత్రంలో విలన్ గా నటిస్తున్న కారణంగా అక్కడ భారీ ఎత్తున అంచనాలున్నాయి.
స్టార్ హీరో అక్షయ్ కుమార్ విలన్ పాత్రలో చేయడం ఏంటీ, అది ఒక సౌత్ సినిమాలో విలన్ గా నటించడం ఏంటీ అంటూ బాలీవుడ్ మీడియాలో అప్పుడు కథనాలు వచ్చాయి. కాని ఇప్పుడు ఒక గొప్ప సినిమాలో అక్షయ్ కుమార్ నటించాడు అంటూ అవే మీడియా సంస్థలు కితాబు ఇస్తున్నాయి. ఇంకా సినిమా విడుదల కాకుండానే గొప్ప సినిమా - అద్బుతమైన విజువల్ వండర్ సినిమా అంటూ పేరు తెచ్చుకుంది. ఇటీవల విడుదలైన టీజర్ మరియు పాత్రల లుక్ లను చూస్తే సినిమా హాలీవుడ్ సినిమాకు ఏమాత్రం తగ్గకుండా ఉంటుందని అనిపిస్తుంది.
ఈ చిత్రంలో హీరో రజినీకాంత్ కు తగ్గకుండా అక్షయ్ కుమార్ పాత్ర ఉంటుందట. కథానుసారంగా విలన్ పాత్ర చాలా కీలకమట. ఆ పాత్ర గురించి తాజాగా దర్శకుడు ఒక తమిళ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ఈ చిత్రం కథ అనుకున్నప్పుడే విలన్ పాత్ర కోసం ఒక పెద్ద స్టార్ ను ఎంపిక చేయాలని అనుకున్నారు. నేను తెరకెక్కించిన ఐ సినిమా ఆడియో వేడుకకు హాలీవుడ్ స్టార్ ఆర్నాల్డ్ వచ్చిన సమయంలో 2.ఓ గురించి - విన్ పాత్ర గురించి చర్చించాను. కాని ఆయనతో వర్కౌట్ కాలేదు.
ఆర్నాల్డ్ నో చెప్పిన తర్వాత కొన్నాళ్లు ఎదురు చూసి కమల్ హాసన్ ను సంప్రదించాను. కథ విన్న తర్వాత ఆయన కూడా ఈ చిత్రంలో నటించేందుకు ఆసక్తి చూపించలేదు. అదే సమయంలో లైకా ప్రొడక్షన్స్ వారు ‘కత్తి’ రీమేక్ ను అక్షయ్ తో చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ సమయంలో అక్షయ్ కి కథ చెప్పడం - పాత్రలోని విభిన్నమైన షేడ్స్ ఆయనకు బాగా నచ్చడం జరిగింది. దాంతో వెంటనే ఓకే చెప్పాడు. ఈ చిత్రం కోసం అక్షయ్ చాలా కష్టపడ్డాడు అంటూ శంకర్ చెప్పుకొచ్చాడు. దాదాపు 500 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైర్ ను ఈనెల 3న ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయబోతున్నారు.