ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నారు శేఖర్ మాస్టర్. మన కష్టం ఎప్పుడూ ఊరకనే పోదు దానికి తగిన ప్రతిఫలం ఇస్తుంది అని చెప్పడానికి బెస్ట్ ఎక్సాంపుల్ గా నిలుస్తున్నారు. ఢీ డ్యాన్స్ షో ద్వారా ఒక మాస్టర్ గా ఎదిగి ప్రస్తుతం టాలీవుడ్ లో దూసుకెళ్తున్న డ్యాన్స్ మాస్టర్ గా అదరగొడుతున్నాడు శేఖర్ మాస్టర్.
కొరియోగ్రఫీ విషయంలో అతను ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఫ్యాన్స్ కోరికలను.. అంచనాలను దృష్టిలో పెట్టుకుని స్టార్స్ కి డ్యాన్స్ కంపోజ్ చేస్తుంటాడు.
టాలీవుడ్ స్టార్ హీరోలందరికి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేస్తూ వస్తున్న శేఖర్ మాస్టర్ ఒకేసారి చిరంజీవి వాల్తేరు వీరయ్య, బాలకృస్ణ వీర సింహారెడ్డి లో పనిచేశారు. వాల్తేరు వీరయ్యలో అన్ని పాటలకు ఆయన డ్యాన్స్ కంపోజ్ చేయగా వీర సింహారెడ్డి లో సుగుణ సుందరి, మా బావ మనోభావాలు అనే సాంగ్స్ ని కంపోజ్ చేశారు.
ఈ సాంగ్స్ కంపోజ్ చేసే టైం లో ఈ సినిమాలు రెండు ఒకే టైం కు వస్తాయని అనుకోలేదట. కానీ ఇప్పుడు రెండు సినిమాలు ఒకరోజు గ్యాప్ తో రిలీజ్ అవడం డ్యాన్స్ మాస్టర్ గా కొద్దిగా టెన్షన్ గా ఉందని అంటున్నారు శేఖర్ మాస్టర్.
అంతేకాదు చిరంజీవి, బాలకృష్ణ మధ్యలో ఉన్న ఒక కామన్ క్వాలిటీ గురించి ప్రస్తావించారు శేఖర్ మాస్టర్. వారి డెడికేషన్, కమిట్మెంట్, టైమింగ్ ఈక్వల్ గా ఉంటాయని. వారికి ఏదైనా డ్యాన్స్ మూమెంట్ ఇస్తే దాన్ని సక్సెస్ చేసేంత వరకు అసలు రిలాక్స్ అవరని అన్నారు శేఖర్ మాస్టర్. మొత్తానికి శేఖర్ మాస్టర్ చెప్పిన దాన్ని బట్టి చిరు, బాలయ్యలో ఒకేరకమైన క్వాలిటీస్ ఉన్నాయని చెప్పొచ్చు.
ఇక వాల్తేరు వీరయ్య, వీర సింహా రెడ్డి రెండు సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతున్నాయి. పొంగల్ రేసులో పందెం కోడిలా ఒక సినిమా మీద మరో సినిమా పోటీ పడుతున్నాయి. ఈ రెండు సినిమాల నిర్మాతలు ఒకరే అవడం విశేషం. ఇలా ఒకే ప్రొడక్షన్ కి సంబంధించిన సినిమాలు ఒకరోజు తేడా తో రిలీజ్ అవడం ఇదే మొదటిసారి అని చెప్పొచ్చు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.