వీర‌య్య రాక్...ఫ్యాన్స్ కి షాక్!

Update: 2022-12-15 07:30 GMT
'వాల్తేరు వీర‌య్య‌'లో  'బాస్ పార్టీ' సాంగ్ పై నెట్టింట ఏ రేంజ్లో ట్రోలింగ్ జ‌రిగిందో చెప్పాల్సిన ప‌నిలేదు. ఈ పాట‌ని ర‌చించి.. ఆల‌పించి..సంగీతం అందించిన దేవి శ్రీ ప్ర‌సాద్ పై ర‌క‌ర‌కాల మీమ్స్  వ‌చ్చాయి. మెగా డై హార్డ్ ఫ్యాన్స్ ని మెప్పించినా మెజార్టీ వ‌ర్గంలో బాస్ పార్టీ అంత‌గా క్లిక్ అవ్వ‌లేద‌నే   ఫీడ్ బ్యాక్ వ‌చ్చింది. అయినా మెగాస్టార్ మాస్ స్టెప్పుల‌తో ఆ నెగిటివిటీని ఎలాగూ తొల‌గించుకున్నారు.

ఈ నేప‌థ్యంలో తాజాగా  దేవి శ్రీ మ‌ళ్లీ అలాంటి ప్ర‌యోగం మరొక‌టి  చేసాడనుకుని మొద‌ట్లో  కంగారు ప‌డిన‌ త‌ర్వాత కాసేప‌టికి అభిమానులు స‌హా ప్రేక్ష‌కులు  కుద‌ట ప‌డ్డారు. ఓసారి ఆ  వివ‌రాల్లోకి వెళ్తే ప్ర‌స్తుతం వాల్తేరు వీర‌య్య షూటింగ్ యూర‌ప్లో జ‌రుగుతోన్న‌సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా చిరంజీవి..శ్రుతి హాస‌న్ ల‌పై  రెండు పాట‌ల‌కు సంబంధించి షూట్ జ‌రుగుతోంది.

అక్క‌డ ఇద్ద‌రి మ‌ధ్య ఓ యువ‌ళ గీతాన్ని చిత్రీక‌రిస్తున్నారు. 'నువ్వు శ్రీదేవి అయితే అనే పాట‌కు చిరు..శ్రుతి డాన్సు చేస్తున్నారు. ఆ పాట‌కి సంబంధించిన ఓ వీడియోని చిరంజీవి ఓ రిస్టార్లో కూర్చుని షేర్ చేసారు.

ఆ వీడియో చివ‌ర్లో ఆ పాట పాడుతున్న‌ట్లు దేవి శ్రీ ప్ర‌సాద్ క‌నిపించారు. దీంతో శ్రోత‌లు స‌హా అభిమానులు ఒక్క‌సారిగా కంగారు ప‌డ్డారు. మ‌ళ్లీ దేవి శ్రీ గాత్రం వినిపిస్తుంది ఏంటి? అంటూ  కాసింత గంద‌ర‌గోళానికి గురైనా ..ఆ కాసేప‌టికి రిలాక్స్ అయ్యారు.

ఆ పాట పాడింది దేవి శ్రీ ప్ర‌సాద్ కాదు..'ఏ జిల్లా ఏ జిల్లా' ఫేం అద్నాన్ స‌మీ పాడార‌ని అన‌ధికారిక స‌మాచారం. మ‌రి ఆ పాట నిజంగా ఎవ‌రు ఆల‌పించారు? అన్న‌ది క్లారిటీ రావాలంటే యూనిట్ స్పందించాలి.

చిరు షేర్ చేసిన ఆ వీడియో నెట్టింట వైర‌ల్ అవుతుంది. వీర‌య్య షూటింగ్ చిరు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఈ ట్రిప్ కి చిరు ఫ్యామిలీని కూడా తీసుకెళ్లిన సంగ‌తి తెలిసిందే. ఖాళీ స‌మ‌యంలో కుటుంబంతో ప్రాన్స్  చుట్టేస్తూ..షూట్ స‌మ‌యంలో శ్రుతి హాస‌న్ తో స్టెప్పులేసుకుంటున్నారు.   



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News