బిగ్ బాస్ తెలుగులో మరో సీజన్ ముగిసింది. సీజన్ 6 విజేత ఎవరన్న విషయం అధికారికంగా బయటకు వచ్చింది. ఎప్పటిలానే బిగ్ బాస్ ఇంట్లో జరిగే విశేషాల్ని ముందుగానే లీకులు అయ్యే సంప్రదాయం సీజన్ 6లోనూ కంటిన్యూ అయ్యింది. విజేత ఎవరన్న విషయంపై తలలు బద్దలుకొట్టుకోవాల్సిన అవసరం లేకుండా లీకు వీరులు చెప్పే మాటలు నిజాలుగా మారే సంప్రదాయం సీజన్ 6లొనూ కంటిన్యూ అయినా.. ఎవరూ అంచనా కట్టలేని షాకివ్వటం ద్వారా.. ఔరా అనిపించారని చెప్పాలి.
అంతేకాదు.. సీజన్ 6 విజేతకు తన జీవితంలో కోలుకోలేని భారీ షాకిచ్చిన బిగ్ బాస్.. ఏమైనా జరగొచ్చన్న దానికి నిలువెత్తు రూపం అన్నట్లుగా మారింది. ప్రైజ్ మనీలో విధించిన భారీకోతతో.. విజేతగా నిలిచినప్పటికీ.. ఊసురుమనే అనుభవాన్ని సింగర్ రేవంత్ కు మిగిల్చారు. ఇండియన్ ఐడల్ విజేతగా ఇప్పటికే తనను తాను ఫ్రూవ్ చేసుకున్న రేవంత్ .. బిగ్ బాస్ సీజన్ 6లో హాట్ టాపిక్ గా మారటం తెలిసిందే.
మిగిలిన వారికి భిన్నంగా అగ్రెసివ్ గా ఉంటే అతన్ని.. హౌస్ లో ఉన్న వారంతా టార్గెట్ చేయటం.. తన కోపాన్ని మిగిలిన వారు వేలెత్తి చూపటమే కాదు.. దాన్నో బూచిగా చూపిస్తూ అతగాడ్ని ఆడుకున్న వైనం అందరిని కదిలించటమే కాదు.. నెగిటివ్ రావాల్సిన రేవంత్ కు పాజిటివ్ గా మారింది. సానుభూతి వర్షం కురిసి.. చివరకు అతడ్ని విజేతగా నిలిచేలా చేసింది. అయితే.. ఏం లాభం చివర్లో బిగ్ బాస్ ఇచ్చిన ట్విస్టుతో ట్రోఫి గెలుచుకొని విజేతగా నిలిచారే కానీ.. విజేతకు దక్కాల్సిన భారీ ఫ్రైజ్ మనీ విషయంలో మాత్రం దారుణ కోత పడింది.
సీజన్ లో మొత్తం 21 మంది హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వగా.. చివరకు ఐదుగురు మాత్రమే నిలవటం.. వారిలో రేవంత్ ను విజేతగా నిర్ణయించటం వరకు బాగానే ఉన్నా.. గ్రాండ్ ఫినాలే రోజున చివర్లో బిగ్ బాస్ భారీ ట్విస్టు ఇచ్చారు. టైటిల్ పోరులో రేవంత్.. శ్రీహాన్ నిలవగా.. వారిద్దరిని గోల్డెన్ బాక్స్ తో హౌస్ లోకి వెళ్లారు కింగ్ నాగార్జున. ఈ సందర్భంగా వారిద్దరికి అదిరే ఆఫర్ ఇచ్చారు. ప్రైజ్ మనీలో సగం తీసుకొని హౌస్ నుంచి వెళ్లిపోవచ్చని సూచన చేయగా.. ఇద్దరు ససేమిరా అన్నారు.
అయితే.. ఆ ప్రైజ్ మనీగా ఉన్నరూ.50 లక్షల్లో రూ.30 లక్షలు ఇస్తామని.. వాటిని తీసుకోవటానికి ఓకే చెప్పినోళ్లు వెళ్లిపోవచ్చన్నా.. ఇద్దరు నో అంటే నో అనేసి విజేతగా నిలిచే ప్రయత్నం చేశారు. అప్పుడే.. బిగ్ బాస్ అదిరే ఆఫర్ ను నాగ్ బయటపెట్టారు. ఫ్రైజ్ మనీలో రూ.40 లక్షలు తీసుకొని హౌస్ నుంచి వెళ్లిపోయే అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకుంటారని అడగ్గా.. శ్రీహాన్ ముందుకు రావటం.. అతగాడికి రూ.40లక్షల బాక్సు ఇచ్చేయటంతో అతగాడు రన్నరప్ గా బయటకు వెళ్లిపోయారు. దీంతో.. రేవంత్ విజేతగా నిలిచారు. కానీ.. అతగాడికి దక్కాల్సిన ప్రైజ్ మనీ రూ.50 లక్షలకు కేవలం రూ.10 లక్షలు మాత్రమే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ఈ ఎపిసోడ్ మొత్తం చూసినోళ్లకు.. పెద్దోళ్లు గతంలో చెప్పే ఒక మాట గుర్తుకు వస్తుంది. కోర్టు కేసు ఓడినోడు కోర్టు దగ్గర ఏడిస్తే.. గెలిచినోడు ఇంటికి వచ్చి ఏడుస్తాడన్న మాటకు తగ్గట్లు బిగ్ బాస్ విజేత పరిస్థితి ఉందని మాత్రంచెప్పక తప్పదు. మరెక్కడా లేని విధంగా విజేత తక్కువ మొత్తాన్ని.. రన్నరప్ గా నిలిచినోళ్లు భారీ మొత్తాన్ని సొంతం చేసుకోవటం బిగ్ బాస్ కు మాత్రమే సాధ్యమని చెప్పాలి.
ఇక.. హౌస్ నుంచి ఇంటికి వెళ్లిపోయిన వారికి అవార్డులు ఇస్తామంటే ఎవరికి ఇవ్వాలన్న మాటలకు ఫైనలిస్టులు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బెస్ట్ చెఫ్ అవార్డును మెరీనాకు.. బెస్ట్ స్లీపింగ్ స్టార్ అవార్డు శ్రీసత్యకు.. బెస్ట్ డ్యాన్సర్ అవార్డు ఫైమాకు.. బెస్ట్ గేమర్ అవార్డును రాజ్ కు.. బెస్ట్ లవ్వర్ అవార్డు అర్జున్ కల్యాణ్ కు ఇచ్చారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.