గత కొంతకాలంగా శ్రుతిహాసన్ జాడైనా కనిపించలేదన్న వేదన అభిమానుల్లో ఉంది. ఉన్నట్టుండి టాలీవుడ్ తో అనుబంధానికి కటీఫ్ చెప్పేసి బాలీవుడ్ కి వెళ్లిపోయిందన్న వేదన ఫ్యాన్స్ ని నిలువనీయలేదు. అప్పట్లో కొన్ని తప్పిదాలు - వివాదాలతో శ్రుతిపై టాలీవుడ్ లో నెగెటివ్ ప్రొపగండా సాగడం తనని బాధించి ఉండొచ్చనడంలో సందేహం లేదు. ఒక ప్రాజెక్టకు కమిటై - చివరికి ప్రారంభోత్సవం ముంగిట అందులో నటించడం కుదరదని సైడైపోవడం - కమిట్ మెంట్ లేకపోవడం శ్రుతికి పెద్ద చిక్కులు తెచ్చిపెట్టింది. ఆ తర్వాత దానిని పెద్దలు మీటింగుల్లో కూచుని సెటిల్ చేసిన వ్యవహారం వేరే!
అదంతా అటుంచితే శ్రుతి విదేశీ బోయ్ ఫ్రెండ్ మైఖేల్ కోర్సలేతో సహజీవనం చేయడం - దానిని అధికారికంగా తల్లిదండ్రుల సాక్షిగా ధ్రువీకరించడం వగైరా ఎపిసోడ్స్ జనాల కళ్ల ముందు రింగురింగులుగా తిరుగుతూనే ఉన్నాయి. అంతా సినిమాయేనా? కొంతయినా పర్సనల్ లైఫ్ ఉండాలి కదా! అందుకే కొంతకాలం నటించను అంటూ ఖరాకండిగా చెప్పేసిన శ్రుతి సినిమాల్ని పూర్తిగా తగ్గించేసింది. ఆ క్రమంలోనే మైఖేల్ తో పర్సనల్ లైఫ్ ని నచ్చినట్టు ఆస్వాధించింది. ఆ ఎపిసోడ్స్ కి కాస్తంత బ్రేక్ ఇచ్చి ఇటీవలే బాలీవుడ్ లో ఓ సినిమాకి సంతకం చేసి మళ్లీ లైమ్ లైట్ లోకి వచ్చింది.
ప్రస్తుతం న్యూయార్క్ వెళ్లిన శ్రుతి అక్కడ `ఇండియా డే పెరేడ్`లో పాల్గొని ఎన్నారైల నుంచి అభివాదం అందుకుంది. ఈ గ్రాండ్ మార్షల్ పెరేడ్ లో బ్రిటన్ రాకుమారిలా శ్రుతి ఇచ్చిన ఫోజులు మామూలుగా లేవు. భారత్ మాతాకి జై అంటూ రాజరధంపై రాకుమారిలా సంచరిస్తున్న శ్రుతికి అక్కడ భారతీయులు నీరాజనం పలికారు. ఆ పక్కనే డాడ్ కమల్ హాసన్ అభిమానులకు అభివాదం చేశారు. ఇది అరుదైన దృశ్యం. అరుదైన అవకాశం. ఈ వీడియోని కమల్ హాసన్ స్వయంగా అభిమానులకు షేర్ చేశారు. ఓ విదేశీ గడ్డపై తండ్రీ కూతుళ్లకు దక్కిన గౌరవం ఎంతో ప్రశంసించదగినది.
Full View