రేణూ తర్వాత శృతిహాసన్ కే ఆ ఛాన్స్!!

Update: 2016-05-14 11:38 GMT
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన నెక్ట్స్ మూవీ విషయంలో స్పీడ్ పెంచాడు. సర్దార్ గబ్బర్ సింగ్ ఫెయిల్యూర్ తర్వాత.. తన తర్వాతి సినిమాను ఎస్ జే సూర్యతో చేయాలని నిర్ణయించిన పవన్.. ఎక్కడా టైమ్ వేస్ట్ చేయడం లేదు. సర్దార్ విషయంలో చాలానే ఆలస్యం జరిగింది. షూటింగ్ పార్ట్ విషయంలో పవన్ బద్ధకించడం ఒకటైతే.. హీరోయిన్ ను ఫైనలైజ్ చేయడానికే రెండేళ్లు పట్టింది. ఎస్ జే సూర్యంతో చేయనున్న సినిమాకి మాత్రం హీరోయిన్ ని చాలా త్వరగానే నిర్ణయించేశారు.

పవన్ కళ్యాణ్ తో గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ లో నటించిన శృతి హాసన్ కే మరోసారి హీరోయిన్ ఛాన్స్ ఇచ్చాడు పవన్. జూన్ మొదటి వారంలో షూటింగ్ ప్రారంభం కానుండగా.. శృతి కూడా దాదాపు అదే టైమ్ కి యూనిట్ తో జతయ్యే అవకాశాలున్నాయి. అయితే.. ఇలా పవన్ తో రెండో సారి జత కట్టే ఛాన్స్ అంత తేలిగ్గా ఏ హీరోయిన్ కి దక్కదు. అసలిప్పటివరకూ పవర్ స్టార్ మాజీ వైఫ్ రేణూ దేశాయ్ కి తప్ప.. తనతో రెండోసారి చేసే అవకాశం కూడా ఇవ్వలేదు పవన్.

రేణుదేశాయ్ తర్వాత శృతి హాసన్ కే రెండో సారి తనతో నటించే ఆఫర్ ఇచ్చాడు పవన్. మరి పవర్ స్టార్ లాంటి హీరోతో రెండో సినిమా ఆఫర్ ని వదులుకునేందుకు ఏ మాత్రం సిద్ధంగా లేని శృతి.. ఇమ్మిడియేట్ గా డేట్స్ ఇచ్చేసింది.
Tags:    

Similar News