ఓ పదేళ్ల క్రితం యూత్ ని ఊపేసిన కొత్త బంగారు లోకం సినిమాలో హీరో వరుణ్ సందేశ్ తో పాటు క్యూట్ గా చబ్బీగా ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి పాత్రలో కనిపించిన హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ ను మర్చిపోవడం అంత ఈజీ కాదు. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసింది కానీ అవేవి ఆశించిన గుర్తింపు తీసుకురాకపోవడంతో త్వరగానే కనుమరుగు కావాల్సి వచ్చింది. ఆ మధ్య ఓ వివాదంలో టీవీ మీడియాలో హై లైట్ అయిన శ్వేతా ఆ తర్వాత చాలా కాలం కనిపించలేదు. అప్పుడప్పుడు తెలుగు తమిళ సినిమాలు చేసింది కానీ అవేవి ఆశించిన గుర్తింపు ఇవ్వలేదు. తాజగా అమెజాన్ సంస్థ తమ ప్రైమ్ వీడియో స్ట్రీమింగ్ సైట్ కోసం నిర్మించిన గ్యాంగ్ స్టార్స్ వెబ్ సిరీస్ లో శ్వేతా బసు ప్రసాద్ కీలక పాత్ర పోషించింది. ఇందులో జగపతి బాబు కూడా ఉండటం విశేషం. నేనే రాజు నేనే మంత్రి రచయిత లక్ష్మి భూపాలా దీనికి రచన చేయటం మరో ప్లస్. రేపటి నుంచి ఆన్ లైన్ లో రిలీజ్ చేయబోతున్న ఈ సిరీస్ మొదటి భాగంలో పది ఎపిసోడ్లు ఉంటాయి. వీటికి వచ్చే రెస్పాన్స్ ని బట్టి కంటిన్యూ చేయటం జరుగుతుంది.
దీని ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చిన శ్వేతా బసు ప్రసాద్ కొత్త లుక్స్ లో అందరిని ఆశ్చర్యపరిచింది. బాగా సన్నబడటంతో పాటు ఏదో మెరుపు తన కళ్ళలో కనిపించడం అందరు గమనించారు. బిగ్ బాస్ 2లో తను కూడా ఉండవచ్చు అనే అంచనాలు ఇప్పటికే ఉన్నాయి. ఈ వెబ్ సిరీస్ తో పాటు టీవీ మీడియాలో సైతం తనకు మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్న శ్వేతా బసు ప్రసాద్ గ్యాంగ్ స్టార్స్ లో గ్లామర్ టచ్ కూడా ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ ను సిల్లీ మాంక్ ఎంటర్ టైన్మెంట్ తో పాటు వైజయంతి సంస్థకు చెందిన ఎర్లీ మాన్సూన్ టేల్స్ కలిసి నిర్మిస్తోంది. నవదీప్-సిద్ధూ-అపూర్వ-పోసాని-శివాజీ ఇలా సినిమాకు సరితూగే సెటప్ తో భారీగానే నిర్మించారు. అజయ్ భుయాన్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ కి నందిని రెడ్డి క్రియేటివ్ డైరెక్టర్ గా నేతృత్యం వహించారు. మరి శ్వేతాతో పాటు వీళ్లంతా చేసిన అల్లరి చూడాలి అంటే రేపటి దాకా వెయిట్ చేయాలి