అప్పుడెప్పుడో తెలుగులో ‘మన్మథ’ అనే ఒక హిట్టు కొట్టాడు తమిళ హీరో శింబు. అప్పట్నుంచి వరుసగా టాలీవుడ్ మీద దండయాత్ర చేస్తూనే ఉన్నాడు కానీ.. ఫలితం దక్కట్లేదు. ఈ మధ్య అతడి డబ్బింగ్ సినిమాల్ని మన ప్రేక్షకులు అస్సలు పట్టించుకోవట్లేదు. తమిళంలో ఫ్లాప్ అయిన ‘పోడా పోడి’ అనే సినిమాను గత ఏడాది ‘మన్మథన్ ఫర్ సేల్’ పేరుతో అనువదించి.. చీప్ పబ్లిసిటీతో రిలీజ్ చేశారు. కానీ జనాల్ని అది ఏమాత్రం ఆకర్షించలేకపోయింది. ఇప్పుడు శింబు నటించిన మరో సినిమాను తెలుగులోకి తెస్తున్నారు. అదే.. ‘ఇదు నమ్మ ఆళు’. తన మాజీ ప్రేయసి నయనతారతో కలిసి శింబు నటించిన సినిమా ఇది.
దాదాపు రెండేళ్లు వాయిదా పడి ఎట్టకేలకు గత ఏడాది విడుదలైన ‘ఇదు నమ్మ ఆళు’ తమిళంలో మంచి విజయమే సాధించింది. పాండి రాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మంచి లవ్ స్టోరీగా పేరు తెచ్చుకుంది. శింబు-నయన్ కెమిస్ట్రీనే ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలిచింది. నిజ జీవిత ప్రేమికుల్లాగా ఈ సినిమాలో జీవించేసింది శింబు-నయన్ జంట. శింబు.. నయన్ రియల్ లవ్ స్టోరీకి సంబంధించిన రెఫరెన్సులు కూడా ఉంటాయి ఈ చిత్రంలో. ఆండ్రియా కూడా ఈ సినిమాకు ఆకర్షణగా నిలిచింది. ఈ చిత్రానికి ‘మన్మథ రిటర్న్స్’ అని ఇంతకుముందు టైటిల్ పెట్టారు. కారణమేంటో తెలియదు కానీ.. దాన్ని ఇప్పుడు ‘సరసుడు’గా మార్చారు. ఐతే ఈ టైటిల్ వినడానికి మరీ ఎబ్బెట్టుగా ఉంది. అసలు తెలుగులో ఈ పదం వాడుకే కనిపించదు. మరి ఇలాంటి టైటిల్ ఎందుకు పెట్టారో?
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/