రెండు మంచి రాకెట్స్ తో 'స్కైలాబ్‌' ప్రయోగం

Update: 2021-11-07 05:30 GMT
అమెరికా ప్రయోగించిన అంతరిక్ష ప్రయోగ నౌక స్కైలాబ్. 1979 లో ఆ అంతరిక్ష నౌక అదుపు తప్పిందని.. భూమిని ఢీ కొట్టబోతుంది అనే వార్తలు మొదలు అయ్యాయి. అమెరికాకు చెందిన నాసా స్వయంగా స్కైలాబ్‌ భూమిని ఢీ కొట్టబోతుంది అంటూ ప్రకటించడంతో పెద్ద ఎత్తున పుకార్లు మొదలు అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా స్కైలాబ్ ఏ ప్రదేశంలో పడుతుందో అనే చర్చ మొదలు అయ్యింది. ప్రతి ఒక్కరిలో ఆందోళన కనిపించింది. ఆ సమయంలో కొన్ని వింత సంఘటనలు.. విచిత్ర సంఘటనలు.. వినోదాత్మక సంఘటనలు కూడా జరిగాయి. అప్పటి వారు ఇప్పటికి వాటిని చెప్తూ ఉంటే నవ్వు వస్తుంది. కాని ఆ సమయంలో వారి మానసిక పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవడం మాత్రం కాస్త కష్టమే. ఆ విషయాలను వివరించేందుకు దర్శకుడు విశ్వక్ కందెరావ్‌ తెరకెక్కించిన ప్రయోగాత్మక సినిమా 'స్కైలాబ్‌'.

అంతరిక్ష ప్రయోగంకు ఎప్పుడైనా మంచి రాకెట్స్ అవసరం. ఇప్పుడు తెలుగు సినిమా లో జరుగుతున్న స్కైలాబ్‌ ప్రయోగానికి మంచి రాకెట్స్ వంటి హీరో హీరోయిన్‌ ను దర్శకుడు ఎంపిక చేసుకుని మొదటి విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఎలాంటి పాత్రను అయినా నటించకుండా జీవించడంలో ఆయనకు ఆయనే సాటి. అలాంటి సత్యదేవ్‌ ను ఈ సినిమాలో హీరోగా నటింపజేయడం.. తన ప్రతి పాత్రకు కూడా జీవం పోయగల అభినవ సహజ నటి నిత్యామీనన్ ను హీరోయిన్‌ గా నటింపజేయడం వల్ల స్కైలాబ్ మొదటి విజయాన్ని సొంతం చేసుకున్నట్లే అంటే తాజాగా విడుదల అయిన ట్రైలర్ ను చూస్తుంటేనే అర్థం అవుతోంది. సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయాన్ని స్కైలాబ్ ట్రైలర్ తో చెప్పకనే చెప్పేశారు.

కథ మొత్తం ముందే రివీల్‌ అయ్యింది. ఇక స్క్రీన్‌ ప్లే ఎలా సాగుతుంది అనేది చూడాలి. హీరో హీరోయిన్ తో పాటు సినిమాలో కనిపించబోతున్న ప్రతి ఒక్కరు కూడా పూర్తి స్థాయి ఎంటర్‌ టైన్ మెంట్ ను ఇవ్వడం ఖాయం అన్నట్లుగా ఉంది. ట్రైలర్ సినిమా స్థాయిని పెంచేసింది. సినిమాలో అప్‌ కమింగ్‌ ఫన్నీ డాక్టర్ గా సత్యదేవ్‌ కనిపించబోతున్నాడు.. ఇక జర్నలిస్ట్‌ గా ఏదో సాధించాలనే పట్టుదలతో ప్రయత్నాలు చేసే అమ్మాయి పాత్రలో నిత్యామీనన్‌ కనిపించబోతుంది. వీరిద్దరి పాత్రలు చాలా విభిన్నంగా ఉన్నాయి. ట్రైలర్ లో వీరు ఎలా కలుస్తారు.. వీరి కలయిక ఉంటుందా లేదా అనేది చూపించలేదు. కాని రెండు మంచి పాత్రలను వీరు చేస్తున్నారు అనేది మాత్రం కన్ఫర్మ్‌. స్కైలాబ్‌ వంటి ప్రయోగం ఇలాంటి నటీనటులతో చేస్తే ఖచ్చితంగా సక్సెస్‌ అవుతుందనే నమ్మకంను విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా పక్కా కమర్షియల్‌ గా ఉంటుందనే నమ్మకంను ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్‌ 4న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు మాత్రమే కాకుండా ఇండస్ట్రీ వర్గాల వారు కూడా ఎదురు చూస్తున్నామంటున్నారు.

Full View
Tags:    

Similar News