రంగుల ప్రపంచంలో డబ్బు ఎంత వేగంగా వస్తుందో అంతే వేగంగా చేజారుతుందని చెబుతుంటారు. ఇక్కడ ఎందరో సంపాదిస్తుంటారు. కొందరు పోగొట్టుకుంటారు. సరైన క్రమశిక్షణ.. ముందు చూపు లేకపోతే గోల్ మాల్ అయిపోతారు. ఇది ఎందరికో ప్రత్యక్ష అనుభవం. అయితే అలా గోల్ మాల్ అయిపోకుండా తెలివిగా పెట్టుబడులు పెట్టిన మేధావిగా అందగాడు శోభన్ బాబు పాపులరయ్యారు. ఆయన ఆరోజుల్లో హీరోగా సంపాదించిన డబ్బును తెలివిగా భూమిపై - రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి అర్థవంతమైన లైఫ్ ని లీడ్ చేశారు. పెట్టుబడి పదింతలై కోట్లాది రూపాయల విలువ చేసే ఆస్తుల్ని ఆర్జించారాయన. అంతేకాదు.. తనతో పాటు ఉన్న ఇతర నటీనటులకు ఆయన ఇదే సలహానిచ్చేవారు.
అలా శోభన్ బాబు ఇచ్చిన సలహా తన జీవితాన్ని మార్చిందని మురళిమోహన్ అన్నారు. ``శోభన్ బాబు హీరోగా నటించిన చాలా సినిమాల్లో రెండో హీరోగా నటించాను. ఆయన ఓసారి నన్ను అడిగారు. వచ్చిన డబ్బు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నావు? అని ప్రశ్నించారు. దానికి నేను స్వతహాగానే బిజినెస్ మేన్ ని అని చెప్పాను. భాగస్వాములతో కలిసి పెట్టుబడులు పెట్టాను..`` అని ఆయనకు చెప్పాను. దానికి ఆయన ఓ మాటన్నారు. భాగస్వాములతో కలిసి పెట్టుబడిదారుడిగా చేరితో వాళ్లు లాభాలు పంచుతారని ఎలా అనుకున్నావ్? అని ప్రశ్నించారు. ఆయన అన్నట్టే ఆర్నెళ్లు తిరగకుండానే ఓ కంపెనీ మూసేశారు. ఏడాదిలోపు ఇంకొకటి మూసేశారు. వాళ్లు చేసిన అప్పులు నా నెత్తిన పడ్డాయి. ఇదే విషయం శోభన్ బాబు గారికి చెప్పాక - ఆయన ఇచ్చిన ఓ సలహా నా మనసులో నాటుకుపోయి ఆ తర్వాత భూమిపైనే పెట్టుబడులు పెట్టాను.. అని మురళీమోహన్ తెలిపారు.
ప్రపంచంలో భూభాగం చిన్నది.. మూడొంతులు సముద్రం - ఒక వంతు భూమి మాత్రమే ఉంది. మనుషులు పెరుగుతున్నారు.. భూమిపై పెట్టుబడి పెట్టండి! అని ఆరోజు శోభన్ బాబు ఇచ్చిన సలహానే పాటించి ఎదిగానని శ్రీమంతుడు మురళిమోహన్ తెలిపారు. శోభన్ బాబు అవార్డుల ప్రచార కార్యక్రమంలో ఈ సంగతిని వెల్లడించారు. అయితే చంద్రబాబు పలు దఫాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బినామీ బిజినెస్ మేన్ గా - రియల్టర్ గా మురళీమోహన్ భారీగా ఆస్తుల్ని సంపాదించారని చెబుతుంటారు. ప్రభుత్వాధీశుల్ని గుప్పిటపట్టి రియల్ ఎస్టేట్ లో చక్రం తిప్పిన మురళీమోహన్ అసలు నటుడవ్వాలనుకోలేదు. అనుకోకుండా నటుడు అయ్యి - అటుపై సినీపరిచయాలతో.. శోభన్ బాబు సలహాతో అతడు రియల్ ఎస్టేట్ డాన్ అయ్యారు. తనలోని బిజినెస్ మేన్ నటుడిని ప్రతిసారీ డామినేట్ చేసేసేవాడు. అలా ఆయన సినీరంగంలో - రియల్ ఎస్టేట్ లో పెట్టుబడులు పెట్టి వేలకోట్లు ఆర్జించారని చెబుతుంటారు. ప్రస్తుతం తేదేపా తరపున రాజమండ్రి ఎంపీగా ఉన్నారాయన. ఇటు హైదరాబాద్ హైటెక్ సిటీ పరిసరాల్లో `జయభేరి` పేరుతో భారీగా ఆస్తులు ఉన్నాయి. హైదరాబాద్ చుట్టుపక్కల పలుచోట్ల భారీ రియల్ వెంచర్లు ఉన్నాయి. వీటితో పాటు - నవ్యాంధ్ర ప్రదేశ్ లో అమరావతి - రాజమండ్రి సహా ఖరీదైన నగరాల్లో మురళిమోహన్ రియల్ వెంచర్లకు భారీ డిమాండ్ నెలకొందని తెలుస్తోంది. శోభన్ బాబు ఇచ్చిన ఒక్క సలహా ఇలా వేలకోట్ల డీల్ అని ఆరోజు మురళిమోహన్ సైతం ఊహించి ఉండరు. శోభన్ బాబు ఆస్తులు కోట్లాది రూపాయలు అనుకుంటే, మురళీమోహనుడు ఆస్తులు వేలకోట్లు అంటూ నిరంతరం జనాల్లో ముచ్చటా సాగుతోంది.