బాలీవుడ్ కండల హీరో ఎరక్కపోయి ఇరుక్కుపోయాడా? అనకూడని ఆ ఒక్క మాటతో ఇరకాటంలో పడ్డాడా? అంటే అవుననే తాజా సీన్ చెబుతోంది. భాయ్ నోరు జారి బుక్కయ్యాడు. అందుకే ఒక్కొక్కరుగా పడతులు ఓ రేంజులో ఆడుకుంటున్నారు. తెలిసీ తెలియకనో సరదాగానో ఏదో ఒక కామెంట్ విసిరేస్తే దాని ఫలితం ఎలా ఉంటుందో మరోసారి కండల హీరోకి ప్రాక్టికల్ గా తెలిసొస్తోంది.
నిన్నటి రోజున సల్మాన్ భాయ్ ఓ ఇంటరాక్షన్ లో ప్రియాంక చోప్రా గురించి చేసిన కామెంట్ జోరుగా వైరల్ అయ్యింది. ``పెళ్లాలు మొగుళ్లనే వదులుకుని నాకోసం వచ్చేస్తారు!`` అన్న అర్థంలో అతడు పీసీపైనే సెటైర్ వేయడంతో దానికి సామాజిక మాధ్యమాల్లో కౌంటర్లు పడిపోయాయ్. సరైన మగాడి కోసం అమెరికా వెళ్లిపోయింది పీసీ! అంటూ సల్మాన్ ని ఆడుకున్నారు. భారత్ (జూన్ లో రిలీజ్) చిత్రం కోసం పీసీ కాల్షీట్లు సర్ధుబాటు చేయలేకపోయిన మాట నిజం. దాంతో భాయ్ పీసీని ఎలాగైనా నటింపజేయాలని చాలానే తంటాలు పడ్డాడు. పీసీ కోసం తన కాల్షీట్లను సైతం సర్ధుబాటు చేసుకుంటానని వెసులుబాటు ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ జీవితంలో ఎంతో ముఖ్యమైన పెళ్లి కోసం ఆ ఛాన్స్ వదులుకుని వెళ్లిపోయింది. అమెరికా బోయ్ ఫ్రెండ్ నిక్ జోనాస్ ని పెళ్లాడి సెటిలైంది. తర్వాతి సంగతులు తెలిసిందే.
అయితే పీసీ రెబలియన్ డెసిషన్ నచ్చని సల్మాన్ పలుమార్లు వేదికపై తనపై సెటైర్లు వేసాడు. టైమ్ చూసి పంచ్ లపై పంచ్ లు విసిరాడు. `భర్త కోసం `భారత్` నే వదులుకుంది` అని ఓసారి.. `భారత్` కంటే అమెరికా ఎక్కువైపోయిందని! మరోసారి.. భర్త కోసం ఏకంగా భారత్ నే వదులుకుందని!! ఇంకోసారి.. రకరకాలుగా పంచ్ లు వేశాడు భాయ్. అయితే ఇదంతా చూస్తూ మహిళా లోకం ఊరుకుంటుందా? పంచ్ లు వేయడంలో రిధమ్ ని.. రైమింగ్ ని క్యాచ్ చేసిన సింగర్ సోనా మొహాపాత్ర ఉన్నట్టుండి సల్మాన్ తీరుపై ఓ ఉరుము ఉరిమింది. సోషల్ మీడియా వేదికగా అతడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రియాంకకు లైఫ్ లో చేయాల్సిన ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి అందుకే `భారత్` నుండి గౌరవంగా తప్పుకుంది. తన భర్త- కుటుంబంతో ఉండాలనుకుంది.. అందులో తప్పేం ఉంది? అంటూ సల్మాన్ ని నిలదీసింది. ప్రియాంక చోప్రా ఎందరో మగువలకు ఆదర్శంగా నిలుస్తోంది. అయినా దేశంలో లేని ఆవిడపై పడి ఏడ్వడం ఎందుకు? వేరొక మగువ (కత్రిన) నీతో ఉండగా.. తన(పీసీ)పైనే ఎందుకీ కామెంట్లు?.. నీచమైన పని కాదా? అంటూ తిట్టేసింది సదరు గాయని సోనా. పాపం భాయ్! అలా బుక్కయిపోయాడు మరి!!