లోటుపాట్ల గుట్టు విప్పేసిన విలన్

Update: 2016-11-11 05:30 GMT
సినిమా నిర్మాణ సమయంలో ఎంతటి నిర్లక్ష్యం కనిపిస్తుందో.. తాజాగా కన్నడ సినిమా మాస్తి గుడి విషయంలో ప్రూవ్ అయింది. ఇద్దరు నటుల ప్రాణాలు ఒకే సమయంలో గాల్లో కలిసిపోవడం అంటే.. అది ఏ మాత్రం వదిలేయాల్సిన విషయం కాదు. ఈ విలన్ పాత్రాఆరులు ఇద్దరికీ అన్ని రంగాల నుంచి సపోర్ట్ వస్తోంది. ఇప్పుడు అరుంధతి విలన్ సోనూ సూద్ కూడా నటుల ప్రాణాలను పట్టించుకోవట్లేదంటూ.. సినిమా నిర్మాణంలో జరిగే లోటు పాట్లు గుట్టు విప్పేశాడు.

'మాస్తిగుడి మేకింగ్ వీడియోలను చూశాను. యూనిట్ ఎంత నిర్లక్ష్యంగా ప్రవర్తించారో అర్ధమవుతుంది. ఉదయ్.. అనిల్ లు ఈత రాదని ముందే చెప్పినా.. ప్రొడ్యూసర్స్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదు. కొన్ని రిస్కీ షాట్స్ చేసినపుడు సేఫ్టీ నెట్ లేకుండానే చేయాల్సి వచ్చిన  సందర్భాలు నాకు కూడా ఉన్నాయి. మన నిర్మాతలకు ఈ విషయంలో ఎలాంటి పట్టింపులు పెద్దగా ఉండవు' అంటూ కుండబద్దలుకొట్టేశాడు సోనూసూద్.

'ఇప్పుడు జాకీచాన్ తో కుంగ్ ఫూ యోగా మూవీలో నటిస్తున్నాను. అక్కడ అంబులెన్స్ లేని రోజు అసలు ఉండదు. సెట్ లో డాక్టర్లు తిరుగుతూనే ఉంటారు. మనకు అలాంటి సిస్టం లేకపోవడంతోనే ప్రమాదాలు జరుగుతున్నాయి' అంటూ నటుల ప్రాణాలను నిర్లక్ష్యంగా చూస్తున్న ఇండియన్ మూవీ మేకర్స్ పై ఆగ్రహం వ్యక్తం చేశాడు సోనూ సూద్.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News