స్టార్ యాక్టర్ సోనూసూద్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎందుకంటే ఆయన సినిమాలలో ఎంతటి విలనిజం పండిస్తాడో.. బయట అంత సేవాగుణం కలిగిన మంచి మనిషి. ఈ విషయం అందరికి తెలిసిందే. అంటే ఇంతకాలం తెలిసుండక పోవచ్చు కానీ ఈ లాక్ డౌన్ సమయంలో అసలు సోనూసూద్ కనిపించాడు. ఎక్కడ చూసినా సోనూసూద్ గురించి చర్చలు నడుస్తున్నాయి. అయితే మరి ఈ సోనూసూద్ అసలు ఎక్కడ పుట్టాడు..? ఆయన లైఫ్ ఏంటి..? మరి ఆయన ఫ్యామిలీ గురించి ఎవరికైనా తెలుసా..? మరి ఈ విషయాలు ఏంటో చూద్దాం! సోనూసూద్ పుట్టి పెరిగింది అంతా పంజాబ్ రాష్ట్రంలోని మోగాలో. 1973, జులై 30న జన్మించాడు. సోను తండ్రి శక్తి సాగర్ సూద్. వ్యాపారం చేసేవారట.
తల్లి సరోజ్ సూద్ టీచర్. ఇక సోనుకి ఒక సిస్టర్ మోనికా సూద్. ఆమె ఒక సైంటిస్ట్. స్కూలుకి వెళ్లే సమయంలోనే సోను తన తండ్రి వ్యాపారంలో హెల్ప్ చేసేవాడట. ఉన్నత విద్యకోసం మహారాష్ట్ర వెళ్లి.. నాగపూర్ లోని యశ్వంతో చవాన్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ పట్టా పొందాడు. ఇంజనీరింగులో ఉన్నప్పుడే మోడలింగులోకి అడుగు పెట్టాడు సోను. మొదటి సంపాదనగా 500 రూపాయలు సంపాదించి డెనిమ్ దుస్తులు కొనుక్కున్నాడట. ఇక గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక ముంబైలోనే స్నేహితులతో ఉంటూ ప్రైవేట్ ఉద్యోగం చేసాడట. అప్పుడు సోను జీతం 4500 రూపాయలు. మంత్లీ ట్రెయిన్ పాస్ తీసుకొని ఉద్యోగం చేసేవాడట. అదే టైంలో మోడలింగ్ ట్రై చేస్తూ 'గ్రాసిమ్ మిస్టర్ ఇండియా' పోటీలో పాల్గొన్నాడు.
ఇక నటుడిగా సోను ప్రస్థానం 1999లోని తమిళ చిత్రం కలాగర్ తో ప్రారంభం అయింది. తర్వాత 2002లో 'షాహిద్ ఈ అజాం' మూవీతో హిందీలో అడుగుపెట్టాడు. తెలుగులో చాలా సినిమాలు చేసాడు కానీ ఆయనను స్టార్ చేసింది మాత్రం అరుంధతి సినిమానే. సోను కెరీర్ అరుంధతి ముందు తర్వాత అనేంత ప్రభావం చూపించింది. ఎన్నో అవార్డులతో పాటు నేమ్ ఫేమ్ అన్నీ తెచ్చిపెట్టింది. ఇక 1996లో సోను లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. ఆయన భార్య సోనాలి. వీరికి ఇద్దరు కొడుకులు అయాన్, ఇషాన్. ఇక మొదటి నుండి కూడా భర్త చేసే ప్రతి పనిలోనూ భార్య సోనాలి అండగా ఉంటుందట. అయితే ఆమెకి మీడియా ముందుకు రావడం ఇష్టం లేక భర్త వెనక తోడుగా ఉంటుందని సమాచారం. ఇదిలా ఉండగా త్వరలోనే సోనూసూద్ వలస కార్మికుల పై ఓ పుస్తకం రాసి విడుదల చేస్తానన్నాడు. ఆ పుస్తకం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.