యాభై ఏళ్ల బాలు..

Update: 2015-12-15 04:50 GMT
'షష్టిపూర్తి వయస్సు కూడా దాటిన ఎస్పీబీకి 50 ఏళ్లేంటబ్బా' అని కళ్ళు పులుముకుంటున్నారా..? అవునండీ.. మన ఎస్పీబీ వయస్సు అచ్చంగా 50 ఏళ్లే. అయితే మనకు పెద్దగా పరిచయం లేని శ్రీపతి పండితారాధ్యుల సుబ్రహ్మణ్యం వయసు మాత్రం 70 ఏళ్లకు దగ్గరే. అదేమిటీ అంటే.. అంతే మరి..

అశేష ప్రజానికానికి బాలు గాయకుడిగానే తెలుసు. కానీ ఇంజనీరింగ్ చదువుకి మధ్యలోనే స్వస్తి పలికారని ఎంతమందికి తెలుసు..? అంచేత మనకి తెలిసిన బాలు గారికి యాభై సంవత్సరాలే. అలా బాలు గారి మనకి పరిచయమై నేటికి యాభై ఏళ్ళు గడిచాయి. గాన గంధర్వుడిగా కీర్తిని సొంతం చేసుకున్న ఎస్పీబీ 1965డిసెంబర్ 15న తొలిసారి తన గానామృతాన్ని పంచారు. అప్పటికే ఘంటసాల, పీబీ శ్రీనివాస్ లాంటి ఉద్దండులు ఉండనే వున్నారు. అందరిలోనూ తనదైనా గాత్ర మాధుర్యాన్ని అందించారు గనకనే గాయకుడిగా మరొకరికి సాధ్యంకాని విధంగా 40వేలకు పై చిలుకు పాటలు పాడగలిగారు. స్వచ్చమైన మనసుతో ముసి ముసి నవ్వులు రువ్వే పసి 'బాలు'డు గాన'యోగి' గా వెలిగినతీరు ఎందరికో ఆదర్శప్రాయం. తుపాకీ.కామ్ తరఫున గాయకుడిగా బాలు గారికి యాభైవ జన్మదిన శుభాకాంక్షలు.        
Tags:    

Similar News