'గాడ్ పాద‌ర్' ని చూసి త‌ట్టుకోలేక‌పోతున్న శ్రీముఖి!

Update: 2022-10-06 09:30 GMT
'గాడ్ ఫాద‌ర్' లో మెగాస్టార్ చిరంజీవి లుక్ ఎంత‌టి సంచ‌ల‌నం సృష్టించిందో? చెప్పాల్సిన ప‌నిలేదు. నెరిసిన త‌ల‌..గెడ్డం..మీసం..ఆహార్యం..కాస్ట్యూమ్స్ తో న్యూ మేక‌వ‌ర్ లో క‌నిపించారు.  మెగాస్టార్ ని స‌రికొత్త  కొత్త లుక్ లో ప‌రిచ‌యం చేసారు. 150 సినిమాలు చేసిన స్టార్ ని ఆద్యంతం కొత్త‌గా చూపించే ప్ర‌య‌త్నం ప్ర‌శంస‌నీయం.

ఈ క్రెడింట్ అంతా ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజాకే చెల్లుతుంది. అత‌ని విజ‌న్ కి త‌గ్గ‌ట్టు మ్యాక‌ప్ ఆర్టిస్టులు  మెగాస్టార్ ని ఆ ర‌కంగా మేకోవ‌ర్ చేసారు.  అందంత ఈజీగా జ‌రిగిన ప్రాస‌స్ కాదు. ఆ లుక్ కోసం అంత‌కు ముందు కొంత ఆర్ట్ వ‌ర్క్ చేసారు.  లుక్ పై ర‌క‌ర‌కాల డిస్క‌ష‌న్స్ జ‌రిగాయి. ఏ లుక్ అయితే బాగుంటుంద‌ని ఒక‌టికి ప‌దిసార్లు క్రాస్ చెక్ చేసుకుని ఫైన‌ల్ గా గాడ్ ఫాద‌ర్ ఇలా ఉంటే?  బాగుంటాడ‌ని ఓ అంచ‌నాకి  వ‌చ్చి డిసైడ్ చేసిన లుక్ ఇది.  

ఈ లుక్ రిలీజ్ అనంత‌రం సోష‌ల్ మీడియాలో సునామీలా దూసుకుపోయింది. అభిమానుల‌కి  చిరంజీవి న్యూలుక్ స‌రికొత్త అనుభూతినిచ్చింది. రెగ్యులర్ లుక్స్ కి భిన్నంగా క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. మ‌రి  ఇందులో లేడీ ఫ్యాన్స్ కూడా ఉన్నారా? అందులోనూ టీవీ యాక‌ర్లు ఉన్నారా? అంటే అవుననే తెలుస్తోంది.

అవును హాట్ యాంకర్ శ్రీముఖి గాడ్ పాద‌ర్  లుక్ గురించి ఏకంగా హాట్ కామెంట్ విసిరింది. అది విని మెగాస్టార్ సైతం విస్తుపోయారు.  ఒక్క‌సారిగా  ఆయ‌న  ముఖంలో క‌నిపించిన ఎక్స్ ప్రెష‌న్.. మునుపెన్న‌డు చూడ‌ని అనుభూతి క‌లిగింది. తెలిసిన యాంక‌రే అలా స్పందించే స‌రికి చిరంజీవి ఎలా స్పందించాలో అర్ధం కాలేదు.

ఇంత‌కీ  శ్రీముఖి చేసినా ఆ హాట్ కామెంటి? ఏంటి అంటే?  చిరంజీవి తో క‌లిసి ప్లైట్ జ‌ర్నీ చేస్తోన్న స‌మ‌యంలో ఈ  లుక్ లో మీరు చాలా హాట్ గా ఉన్నారని చిరంజీవిని చూసి అంటుంది. చూసి త‌ట్టుకోలేక‌పోతున్నా అంది. దీనికి చిరంజీవి ఒక్క‌సారిగా నోరు పెద్ద‌గా  తెరిచి చేసి  విస్తుపోయారు.  ఓ యాకంర్ నోట చిరంజీవి ఇలాంటి మాట వినడం ఇదే తొలిసారి.

సాధార‌ణంగా యాంక‌ర్లు అంతా చిరంజీవిలాంటి పెద్ద హీరోలున్న‌ప్పుడు ఎంతో హుందాగా మాట్లాడుతారు. శ్రీముఖి కాస్త అత్యుత్సాహానికి పోయి బాస్ పైనే హాట్ కామెంట్ విసిరింది. సెల‌బ్రిటీల విష‌యంలో ఇలాంటి కామెంట్లు స‌హ‌జంగానే భావించాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.


Video Here>> https://www.facebook.com/reel/1038049830210357
Tags:    

Similar News