చికాగో సెక్స్ రాకెట్ లీక్ చేసింది నేనే: శ్రీరెడ్డి

Update: 2018-06-25 06:27 GMT
అమెరికాలోని చికాగో కేంద్రంగా బట్టబయలు అయిన సెక్స్ రాకెట్ టాలీవుడ్ ను షేక్ చేసిన సంగతి తెలిసిందే.. ఈ సెక్స్ రాకెట్ విషయంలో శ్రీరెడ్డి రోజుకో బాంబు పేల్చుతూ సంచలనాలు సృష్టిస్తోంది. తాజాగా ఈరోజు శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో అమెరికా వెళ్లి అక్కడ వివిధ పార్టీలు, ఫంక్షన్లలో పాల్గొన్న పలు వర్ధమాన హీరోయిన్లు, యాంకర్లను షేర్ చేసింది. అయితే తెలివిగా దీనిపై ఏమీ రాయలేదు. కేవలం అమెరికాలో వారు చేసిన ఎంజాయ్ నే ఫొటోలతో అందరికీ చూపించి ట్విస్ట్  ఇచ్చింది. సెక్స్ రాకెట్ తో వీరికి సంబంధం ఉందా అన్న విషయాలను మాత్రం శ్రీరెడ్డి వెల్లడించలేదు.

ఇక శ్రీరెడ్డి తాజాగా చికాగో సెక్స్ రాకెట్ ను కదిలించింది తానేనని సంచలన విషయాన్ని తెలిపింది. అమెరికా పోలీసులకు విచారణలో తాను రెండు నెలలుగా సహకరిస్తున్నానని.. యూఎస్ పోలీసులకు అన్ని విషయాలు వెల్లడించానని తెలిపింది. అమెరికాలో పోలీసులకు తాను టచ్ లో ఉంటూ ఈ వ్యభిచారం ఎలా నిర్వహిస్తున్నారనే విషయాలను వెల్లడించినట్టు తెలిపింది. కిషన్-చంద్ర దంపతులు హీరోయిన్స్ ని ఎలా బుక్ చేస్తారు వంటి విషయాలు వారికి తెలిపానని పేర్కొంది. అమెరికా పోలీసులు చేస్తున్న విచారణలో కీలకంగా మారిందని తానేనని శ్రీరెడ్డి వెల్లడించి సంచలనం సృష్టించింది.  

అమెరికాలో ఉన్న ఏ తెలుగు సంస్థకు నేను వ్యతిరేకం కాదు అని శ్రీరెడ్డి పేర్కొంది. కిషన్ నడిపిస్తున్న వ్యభిచారం గురించి మాత్రమే చెప్పానని శ్రీరెడ్డి పేర్కొంది. సెక్స్ రాకెట్ విషయంలో ఓ సాధారణ మహిళగా తాను పోరాటం చేశానని.. మా అసోసియేషన్ ఎదుట అర్ధనగ్న ప్రదర్శన కూడా చేశానని గుర్తు చేసింది. ప్రతి న్యూస్ చానెల్ కు తిరిగి పైసా కూడా ఆశించకుండా ఇంటర్వ్యూలు ఇచ్చానని తెలిపింది. కొన్ని మీడియా చానల్స్ మాత్రం తన ద్వారా బాగా డబ్బులు సంపాదించాయని శ్రీరెడ్డి బయటపెట్టింది.  ఎట్టకేలకు అమెరికా సెక్స్ రాకెట్ లీకేజీతో తాను అనుకున్న లక్ష్యం నెరవేరిందని.. టాలీవుడ్ బాగోతాలు బయటపడ్డాయని పేర్కొంది.
Tags:    

Similar News