శ్రీదేవి జీవిత సత్యాలు చెబుతోందిగా

Update: 2017-11-13 13:21 GMT
అలనాటి అందాల తార శ్రీదేవి సుదీర్ఘ కాలం పాటు ఇండస్ట్రీలో సత్తా చాటింది. పలు భాషల్లో తన ట్యాలెంట్ చూపించిన శ్రీదేవి.. బాలీవుడ్ ను 2 దశాబ్దాలకు ఏలింది. సుదీర్ఘమైన బ్రేక్ తీసుకుని చేసిన ఇంగ్లీష్ వింగ్లిష్.. మళ్లీ ఐదేళ్ల గ్యాప్ తర్వాత చేసిన మామ్ చిత్రాలతో అలరించిన ఈమె.. ఇప్పుడు కూతురుని హీరోయిన్ చేసేందుకు నిర్ణయించుకుంది.

శ్రీదేవి పెద్ద కూతురు జాన్వి కపూర్ సినిమా ఎంట్రీ ఖాయమైన సంగతి తెలిసిందే. కూతురు ఫిలిం ఎంట్రీపై ఇప్పుడు శ్రీదేవి పెదవి విప్పింది. " ఈ వృత్తిని తనకు తానే ఎంచుకుంది. నేను ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలం ఉన్నాను. నిజానికి ఆమె కంటే ముందే నేను మెంటల్ గా ప్రిపేర్ అయిపోయాను. నన్ను చూస్తూ పెరిగిన జాన్వికి.. ఎలాంటి ప్రపంచంలో అడుగుపెడుతున్నాననే అంశంపై చాలానే స్పష్టత ఉంది" అని చెప్పిన శ్రీదేవి.. తన కూతురు కావడం ఎంట్రీ వరకే ఉపయోగపడుతుందని అభిప్రాయపడింది.

"ఏ వృత్తిలో అయినే విజయం తేలికగా అందదు. హార్డ్ వర్క్ చేయాల్సిందే. సవాళ్లను ఎదుర్కోవాల్సిందే. తను ఇందుకు ఇప్పటికే సిద్ధమైందని అనుకుంటున్నా" అని చెప్పిన శ్రీదేవి.. తన కూతుళ్లు ఇద్దరికీ వారి వారి లిమిట్స్ ఏంటో బాగానే తెలుసునని.. అది తన అదృష్టంగాను చెబుతోంది.
Tags:    

Similar News