కోన కోట నుంచి వైట్ల గూటిలోకి..

Update: 2016-04-19 09:30 GMT
కోన వెంకట్ - గోపీ మోహన్ లకు ఏ రేంజ్ బాండింగ్ ఉందో చాలాసార్లు చూశాం. వీళ్లిద్దరూ కలిసి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు స్టోరీలను అందించారు. ముఖ్యంగా శ్రీను వైట్లతో వీరి కాంబినేషన్.. సంచలనాలకు కారణమైంది. అయితే.. ఎన్టీఆర్ మూవీ బాద్షా విడుదల తర్వాత ఇదంతా రివర్స్ అయిపోయింది.

శ్రీను వైట్ల -కోన వెంకట్ లు ఒకరినొకరు మీడియా సాక్షిగా తిట్టి పోసుకున్నారు. దీంతో తనే స్క్రిప్ట్ రాసుకుని మహేష్ తో ఆగడు చేశాడు వైట్ల. కానీ ఇది డిజాస్టర్ మిగిలింది. ఈ రిజల్ట్ కారణంగా.. వైట్ల -కోన క్యాంప్ లను బలవంతంగా కలిపి బ్రూస్ లీ తీశాడు రామ్ చరణ్.. ఇది కూడా బాక్సాఫీస్ దగ్గర  పేలిపోయింది. దీంతో తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన స్థితిలో పడిపోయాడు వైట్ల. మరోవైపు వైట్లతో విడిపోయాక ఒకట్రెండు సక్సెస్ లు చూసి కోన క్యాంప్.. వరుసగా ఫెయిల్యూర్స్ తో విమర్శల పాలైంది. ఇప్పుడు వైట్ల చేతిలో ఓ మెగా మూవీ ఉంది. వరుణ్ తేజ్ తో మిస్టర్ అనే వర్కింగ్ టైటిల్ పై సినిమా స్టార్ట్ చేయనున్నాడు శ్రీను వైట్ల.

వచ్చే నెలలో ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇప్పుడీ సినిమా కోసం కోన వెంకట్ కి  రైట్ హ్యాండ్ గా పిలిచే గోపీ మోహన్ ను తెచ్చుకున్నాడట వైట్ల. అది కూడా కోనతో సంబంధాలను పూర్తిగా కట్ చేసుకోవాలని చెప్పి మరీ మిస్టర్ కోసం రాయించుకుంటున్నాడట. శ్రీను వైట్ల - కోన వెంకట్ - గోపీ మోహన్ ల స్టోరీలో ట్విస్టులు థ్రిల్లర్ ని మించిపోతున్నాయంటున్నా ఫిలింనగర్ జనాలు.
Tags:    

Similar News