ఇప్పుడు యు ట్యూబ్ లో ఏ ఛానల్ ఓపెన్ చేసినా కనీసం రెండు మూడు వీడియోలైనా శ్రీరెడ్డివి ఉంటున్నాయి. సరిగ్గా నెల రోజుల క్రితం ప్రేక్షకులకు ఎవరో కూడా తెలియని శ్రీరెడ్డి ఓవర్ నైట్ లో స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. నిజానికి తను ఏ సినిమాల్లో నటించిందో రెగ్యులర్ గా సినిమాలు చూసే అలవాటున్న ప్రేక్షకులకు కూడా తెలియదు అంటే అతిశయోక్తి కాదు. రోజుకో ఇంటర్వ్యూ ఇస్తూ అనిపించినప్పుడంతా ఒక ట్వీట్ చేస్తూ సంచలనం రేపుతున్న శ్రీరెడ్డికి బ్రేక్ వేసే మార్గం తెలియక పరిశ్రమ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. ఈ మధ్యే కొందరు దర్శకులు నటుల పేర్లు నేరుగా ప్రస్తావించి వాళ్ళను ఇరుకున పెట్టే ప్రయత్నం పట్ల అందరూ మౌనంగా ఉండటమే మంచి ఫలితాన్ని ఇస్తోంది. ఒకవేళ తప్పని స్పందించినా ఇది మరింత పబ్లిసిటీ ఇవ్వడానికి న్యూస్ ఛానల్స్ కి ఫీడింగ్ కి పనికి వస్తుందే తప్ప ఇంకే ఉపయోగం లేదని గుర్తించి సైలెంట్ అయ్యారని టాక్.
శ్రీరెడ్డి మాత్రం రోజుకో రహస్యాన్ని బయటపెడతాను అని బెదిరింపులు కొనసాగిస్తూనే ఉంది. అడ్డుకునే మార్గం ఏదో అర్థం కాక లోలోపల సమాలోచనలు జరుగుతున్నట్టు సమాచారం. దర్శకుడు తేజ తన సినిమాల్లో అవకాశం ఇస్తానని చెప్పినా పరిస్థితిలో మార్పు రావడం లేదు. పైగా మొన్నో ఛానల్ లో జరిగిన డిబేట్ లో సీనియర్ దర్శక నిర్మాత ముందే శ్రీరెడ్డి స్టూడియోలను బ్రోతల్ హౌస్ లతో పోల్చడం మరింత వేడిని రాజేసింది. ఆయన సర్దిచెప్పే ప్రయత్నం చేసినా శ్రీరెడ్డి తగ్గలేదు. ఈ వివాదం వల్ల ఇప్పటికే టాలీవుడ్ పరువు మెల్లగా బయటికి వెళ్తోందని ఒకవేళ జాతీయ మీడియా దృష్టికి కనక ఇది చేరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయాని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శ్రీరెడ్డి ఏం చేస్తే ఇదంతా ఆపేస్తుంది అనే ప్రశ్నకు తన వద్ద కూడా సమాధానం లేదనిపిస్తోంది. ఇప్పటికిప్పుడు అగ్ర హీరోల సినిమాల్లో తనను హీరొయిన్ గా తీసుకోవాలి అనుకోవడం కూడా ముమ్మాటికి అత్యాశే. మరి దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు పడుతుందో వేచి చూడటం తప్ప ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు సీనియర్లు.