తిరిగి డ‌బ్బు ఎలా సంపాదించాల‌నే దానిపైనే-రాజ‌మౌళి

Update: 2023-01-21 03:30 GMT
RRR ప్రపంచవ్యాప్తంగా వేవ్స్ సృష్టిస్తూనే ఉంది! విమర్శకుల ప్రశంసలతో పాటు భారీ క‌మ‌ర్షియ‌ల్ విజ‌యం సాధించిన ఈ చిత్రం ప్ర‌తిష్ఠాత్మ‌క అవార్డుల వేదిక‌పైనా మెరుపులు మెరిపిస్తోంది. ఈ చిత్రం నుండి నాటు నాటు పాట‌కు గోల్డెన్ గ్లోబ్ పుర‌స్కారం ద‌క్కిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిష్ఠాత్మ‌క హాలీవుడ్ క్రిటిక్స్ పుర‌స్కారాల్ని ఈ చిత్రం ద‌క్కించుకుంది.

నిజానికి ఈ భారీ ఎపిక్ యాక్షన్ డ్రామా విడుద‌లైన‌ప్పుడు అవార్డులు రివార్డుల గురించి అస‌లు రాజ‌మౌళి మైండ్ లో లేనే లేదు. వాటి గురించి ఏనాడూ పట్టించుకోలేదు. ఎస్ఎ.స్ రాజమౌళి ఒక సినిమా విడుదల చేసేటప్పుడు కేవలం రెండు విషయాలపై మాత్రమే శ్రద్ధ వహిస్తాడు. వాటిలో ఒకటి అవార్డులు కానే కాదు!

అందుకే ఇప్పుడు అవార్డులు గెలుచుకోవడంపై ఎస్‌.ఎస్ రాజమౌళి ప్ర‌ఖ్యాత 'ది హాలీవుడ్ రిపోర్ట‌ర్' పోర్టల్ తో మాట్లాడుతూ.. తాను ఒక సినిమా తీసే క్ర‌మంలో తిరిగి డ‌బ్బు ఎలా సంపాదించాల‌నే దానిపైనే శ్రద్ధ వహిస్తాన‌ని అన్నారు. అలాగే విమర్శకుల ప్రశంసలు కూడా త‌న‌కు అన‌వ‌స‌రం. తన చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ చాలా ముఖ్యమ‌ని జ‌క్క‌న్న ఈ ఇంట‌ర్వ్యూలో వ్యాఖ్యానించారు.

''నేను డబ్బు కోసం సినిమాలు చేస్తాను.. ప్రేక్షకుల కోసం సినిమాలు చేస్తాను.... విమర్శకుల ప్రశంసల కోసం సినిమాలు తీయను'' అని రాజ‌మౌళి స్ప‌ష్ఠంగా వ్యాఖ్యానించారు. ఆర్‌.ఆర్‌.ఆర్ కమర్షియల్ సినిమా.. ఒకసారి నా సినిమా కమర్షియల్ గా మంచి వసూళ్లను సాధిస్తే నేను చాలా సంతోషిస్తాను. అవార్డులు దానికి పొడిగింపు మాత్ర‌మే. ఇది నా యూనిట్ పడిన కష్టానికి సంబంధించినది. దానికి నేను సంతోషంగా ఉన్నాను అని 'ది హాలీవుడ్ రిపోర్టర్' తో ప్ర‌త్యేక‌ సంభాషణలో అతను వ్యాఖ్యానించాడు.

S. S. రాజమౌళి దర్శకత్వం వహించిన RRR లో జూనియర్ ఎన్టీఆర్ - రామ్ చరణ్ భారతీయ స్వాతంత్య్ర‌ సమరయోధులుగా నటించారు. చ‌ర‌ణ్ ఆంధ్రా విప్ల‌వ వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా న‌టించ‌గా.. తార‌క్ కొమురం భీమ్ పాత్ర‌లో న‌టించారు.  బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా స్నేహితుల‌ పోరాటాన్ని తెర‌పై ఆవిష్క‌రించ‌గా.. ఈ ఎపిక్ యాక్షన్ ఫిల్మ్ లో అజయ్ దేవగన్- అలియా భట్- శ్రియా శరణ్- సముద్రఖని- రే స్టీవెన్‌సన్- అలిసన్ డూడీ -ఒలివియా మోరిస్ త‌దిత‌రులు కీలక పాత్రల్లో నటించారు.

బాహుబలితో జాతీయ స్థాయిలోనూ ఆర్‌.ఆర్‌.ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా ఖ్యాతి గడించిన రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాదిలోనే చిత్రీక‌ర‌ణ ప్రారంభించాలని వేచ‌చి చూస్తున్నారు. ఈ చిత్రాన్ని గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ గా రాజ‌మౌళి ఇప్ప‌టికే అభివర్ణించారు. ఇది భారతీయ మూలాలతో కూడిన ఒక రకమైన జేమ్స్ బాండ్ లేదా ఇండియానా జోన్స్ త‌ర‌హా చిత్రం అవుతుంది'' అని జ‌క్క‌న్న ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. ఈ సినిమాతో పాటు భారతీయ కంటెంట్ తో పాపుల‌రైన లైవ్-యాక్షన్ యానిమేషన్ చిత్రాన్ని కూడా తెర‌కెక్కించేందుకు రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నార‌ని స‌మాచారం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News