బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ మేధోతనం గురించి చెప్పాల్సిన పనే లేదు. అతడు ఒక స్క్రిప్టును ఎంపిక చేసాడంటే అది బ్లాక్ బస్టరే. ఇటీవల కొన్ని తప్పిదాలు చేసినా కానీ వాటి నుంచి బయటపడేందుకు ప్రస్తుతం అతడు మునుపటి కంటే షార్ప్ గా ఆలోచిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజులో యూనివర్శల్ కాన్సెప్టుల్ని ఎంచుకుని కొత్తగా ట్రై చేస్తున్నాడు. దంగల్ తర్వాత మళ్లీ అలాంటి ఫీట్ వేయాలన్నది అమీర్ ఖాన్ ప్లాన్.
ప్రస్తుతం అమీర్ ఖాన్ `లాల్ సింగ్ చద్దా` అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఇది టామ్ హాంక్స్ నటించిన హాలీవుడ్ బ్లాక్ బస్టర్ `ఫారెస్ట్ గంప్` కి రీమేక్. ఈ మూవీని మెజారిటీ పార్ట్ ఛండీఘర్ (పంజాబ్)లో చిత్రీకరించారు. అమీర్ ఓ శిక్కు యువకుడిగా నటిస్తున్నారు. అమీర్ సహా కీలక నటీనటులపై చిత్రీకరణ సాగింది. ఇప్పటికే క్లైమాక్స్ చిత్రీకరణకు టీమ్ సిద్ధమవుతోంది.
ఇక లాల్ సింగ్ చద్దా ఫస్ట్ లుక్ కి చక్కని స్పందన వచ్చింది. తాజాగా పతాక సన్నివేశాల్లో ఊహించని ఛేంజ్ హాట్ టాపిక్ గా మారింది. బ్యాక్‌డ్రాప్ మార్పుతో అమీర్ కొత్తగా ట్రై చేస్తున్నాడట. క్లైమాక్స్ లో కొరోనా వైరస్ ఎలిమెంట్ ని ప్రభావవంతంగా ఉపయోగించేలా స్క్రిప్టును మార్చేశాడట. వాస్తవానికి ఈ సినిమాలో మహమ్మారి కాన్సెప్ట్ ఉంది. కానీ ఇప్పుడు అనూహ్యంగా కరోనా నేపథ్యంతో క్లైమాక్స్ ని ముగించాలని ప్లాన్ చేయడం ఆసక్తిని పెంచుతోంది. ఈ చిత్రంలో కరీనా కపూర్ ప్రధాన కథానాయికగా నటిస్తుంది.