చిన్న సినిమా.. పెద్ద సపోర్ట్

Update: 2017-12-05 15:30 GMT
చాలాకాలం తరవాత యంగ్ హీరో నాగశౌర్య నటించిన చలో చిత్రం టీజర్ ను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ రిలీజ్ చేశాడు. కమెడియన్ సప్తగిరి హీరోగా నటించిన సప్తగిరి ఎల్.ఎల్.బి. మూవీని మెచ్చుకుంటూ మెగా హీరో రామ్ చరణ్ మాట్లాడాడు. సునీల్ హీరోగా నటించిన 2 కంట్రీస్ చిత్రం ప్రమోషనల్ వీడియో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రిలీజ్ చేశాడు. ఈ చిన్న సినిమాలకు ఈ పెద్ద హీరోలు.. డైరెక్టర్ కు ఎలాంటి సంబంధమూ లేదు. కానీ వీళ్లెందుకు ఆ సినిమాను ప్రమోట్ చేస్తున్నారనే క్యూరియాసిటీ ఎవరికైనా వస్తుంది.  ఈ మాత్రం క్యూరియాసిటీ చాలు.. చిన్న సినిమాల దర్శక నిర్మాతలకు తమ చిత్రాన్ని బ్రహ్మాండంగా ప్రమోట్ చేసుకోవడానికి.

‘‘పవన్ కళ్యాణ్ 2 కంట్రీస్ సినిమా టీజర్ రిలీజ్ చేయడం మాకెంతో ప్లస్సయ్యింది. కొద్ది రోజులు సోషల్ మీడియాలో ఇది ట్రెండింగ్ లా నడిచింది. పవర్ స్టార్ లాంచ్ చేశాడన్న ఒక్కమాట చాలామందికి రీచ్ అవడానికి ఉఫయోగపడింది’’ అని చెప్పుకొచ్చారు 2 కంట్రీస్ డైరెక్టర్ ఎన్.శంకర్.  ‘‘ఈ రోజుల్లో సినిమా బాగా తీయడమే కాదు.. దానిని బాగా ప్రమోట్ చేసుకోవాలి. బిగ్ స్టార్స్ ఈ సినిమాను ప్రమోట్ చేసినప్పుడు ఫలానా చిన్న సినిమా వస్తుందనే విషయం ప్రేక్షకులకు తెలుస్తుంది. ఆ హీరోల ఫ్యాన్స్ కూడా ఆ సినిమాపై ఆసక్తి చూపుతారు. దీంతో మంచి ఓపెనింగ్స్ కచ్చితంగా వస్తాయని’’ అంటున్నారు మెంటల్ మదిలో నిర్మాత రాజ్ కందుకూరి. ‘‘గరుడవేగ రిలీజయ్యాక చూసిన పెద్ద స్టార్లు మా సినిమా గురించి సోషల్ మీడియాలో చాలా సపోర్ట్ చేశారు. అది చాలా జెన్యూన్ రియాక్షన్ కూడా కావడంతో చాలామందికి సినిమాపై ఇంట్రస్ట్ పెంచింది’’ అని పెద్దస్టార్ల ప్రమోషన్ గురించి చెప్పుకొచ్చారు హీరో రాజశేఖర్ భార్య జీవిత.

తాజాగా సుమంత్ హీరోగా నటించిన లో బడ్జెట్ మూవీ మళ్లీరావా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అఖిల్ - మంచు లక్ష్మి - రకుల ప్రీత్ సింగ్ హాజరయ్యారు. ఇదే సినిమాను నాగార్జున - రానా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తున్నారు. చిన్న సినిమాలపై బజ్ పెంచడానికి స్టార్ల సపోర్ట్ సరిపోతుంది. కానీ ఆ మూవీ హిట్ కొట్టాలంటే కంటెంట్ కొత్తగా ఉండాలి. అది లేకపోతే పెద్దగా ప్రయోజనం ఉండదు. ఆ మధ్య సుకుమార్ రైటింగ్స్ లో వచ్చిన దర్శకుడు మూవీని యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రమోట్ చేసిని బాక్సాఫీస్ ను ఆకట్టుకోలేకపోయిందన్న విషయం ఇక్కడ ప్రస్తావనార్హం.
Tags:    

Similar News