రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న శ్రీముఖ క్రేజీ అంకుల్స్ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాలో శ్రీముఖి పాత్ర మరియు ఇతర పాత్రలు భారతీయ సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయంటూ తెలంగాణ మహిళ ఐక్య వేదిక నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. నేడు వారు మీడియా ముందుకు వచ్చి క్రేజీ అంకుల్స్ సినిమాను ఆపేయాల్సిందే అంటూ డిమాండ్ చేశారు. మహిళలను కించ పర్చే విధంగా ఉన్న సన్నివేశాలు ఉన్న సినిమాల వల్ల సమాజంలో మహిళల పట్ల మరింతగా చిన్న చూపు పెరుగుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కామెడీ పేరుతో భారతీయ కుటుంబ వ్యవస్థను తీవ్ర ప్రభావితం చేసి అవమానించేలా సన్నివేశాలను ఈ సినిమాలో చూపించబోతున్నారు. సమాజాన్ని తప్పుదోవ పట్టించే ఇలాంటి సినిమాలను విడుదల చేయనివ్వం. కుటుంబాల మద్య చిచ్చు పెట్టి.. వివాదాలను రాజేసే వారి సినిమాలు సమాజానికి మంచివి కావు. క్రేజీ అంకుల్స్ సినిమాలోని వివాదాస్పద సన్నివేశాలు మరియు డైలాగ్స్ ను తీసి వేయాలని లేదంటే సినిమాను అడ్డుకుని తీరుతాం అంటూ మహిళ సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు.
సినిమాల ద్వారా సమాజానికి మంచి చేయకున్నా పర్వాలేదు కాని సమాజాన్ని చెడగొట్టే విధంగా చేయవద్దంటూ వారు విజ్ఞప్తి చేశారు. సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఏమున్నా కూడా సినిమా ను రేపు థియేటర్లలో ఆడనిచ్చేది లేదు అంటున్నారు. శ్రీముఖి ప్రధాన పాత్రలో నటించగా రాజా రవీంద్ర.. మనో.. భరణి మరియు పోసాని కృష్ణ మురళి ఈ సినిమా లో నటించారు. బండ్ల గణేష్ గెస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. సత్తిబాబు దర్శకత్వంలో ఈ సినిమాను శ్రేయాస్ శ్రీనివాస్ నిర్మించాడు. రేపు విడుదల కాబోతుండగా నేడు ఈ వివాదం చుట్టు ముట్టడం చర్చనీయాంశం అయ్యింది. రేపు ఏం జరుగుతుందో అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.