కోడిరామకృష్ణ హెడ్‌ బ్యాండ్‌ స్టోరీ

Update: 2019-02-23 05:57 GMT
తెలుగు ప్రేక్షకులు ఎన్నో గొప్ప సినిమాలను అందించిన గ్రేట్‌ డైరెక్టర్‌ కోడి రామకృష్ణ తీవ్ర అనారోగ్యంతో తుది శ్వాస విడిచిన విషయం తెల్సిందే. శతాధిక చిత్రాల దర్శకుడికి తెలుగు సినిమా పరిశ్రమ ఘన నివాళ్లు అర్పిస్తుంది. ఆయన జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ సినీ రంగ ప్రముఖులు కన్నీరు పెట్టుకుంటున్నారు. ఎప్పుడు కూడా హెడ్‌ కు బ్యాండ్‌ కట్టుకుని కనిపించే కోడి రామకృష్ణ గారికి ఆ బ్యాండ్‌ ఎలా వచ్చిందనేది చాలా మందికి తెలియదు. ఆ విషయం గురించి ఒకసారి కోడి రామకృష్ణ గారు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ క్లారిటీ ఇచ్చారు.

హెడ్‌ బ్యాండ్‌ గురించి ఆయన మాట్లాడుతూ... కేరళలో నా రెండవ సినిమా షూటింగ్‌ చేస్తున్నాం. ఆ సమయంలో ఎన్టీఆర్‌ గారి వ్యక్తిగత మేకప్‌ మన్‌ మోకా రామారావు గారు నా సినిమాకు కాస్ట్యూమ్స్‌ డిజైన్‌ చేస్తున్నారు. కేరళ కోవెలం బీచ్‌ సమీపంలో చిత్రీకరణ చేస్తున్న సమయంలో రామారావు గారు నా వద్దకు వచ్చి మీ నుదురు చాలా పెద్దగా ఉందండి, మీరు ఈ జేబు రుమాలును కట్టుకోండి అంటూ ఇచ్చారు. ఆ రుమాలును రోజంతా కట్టుకుని వర్క్‌ చేశాను. ఆ తర్వాత రోజు ఆ జేబు రుమాలును ఆయన హెడ్‌ బ్యాండ్‌ గా కుట్టి తీసుకు వచ్చారు. ఆయన చెప్పడంతో దాన్ని ధరించడం మొదలు పెట్టాను.

సెంటిమెంట్‌ పరంగా కూడా ఆ హెడ్‌ బ్యాండ్‌ కలిసి వచ్చినట్లుగా అనిపించింది. అందుకే ఏ సినిమా చేస్తున్నా కూడా ఆ హెడ్‌ బ్యాండ్‌ ను ధరించడం మొదలు పెట్టాను. రాను రాను ఏ పబ్లిక్‌ కార్యక్రమాలకు వెళ్లినా కూడా నేను హెడ్‌ బ్యాండ్‌ తోనే వెళ్లాను. పోలీసులకు క్యాప్‌ - రైతుకు రుమాలు ఎలాగో నాకు ఈ హెడ్‌ బ్యాండ్‌ అలా అయ్యింది. ఒక సారి తమిళ ప్రముఖ దర్శకులు బాలచందర్‌ గారు కూడా నా హెడ్‌ బ్యాండ్‌ బాగుందని అన్నారు. ఎంతో మంది నన్ను హెడ్‌ బ్యాండ్‌ ఉంటేనే బాగుంటారు అన్నారు. అందుకే నేను హెడ్‌ బ్యాండ్‌ ను పరిమినెంట్‌ గా ధరించడం మొదలు పెట్టానంటూ అప్పటి జ్ఞాపకాలను ఇంటర్వ్యూలో కోడి రామకృష్ణ గారు చెప్పుకొచ్చారు.
Tags:    

Similar News