నాగ చైతన్య దృష్టిలో హిట్ సినిమా అంటే వేరే అర్ధం ఉంది. నాగ చైతన్య సినిమాలు బాక్స్ ఆఫీసు వద్ద రికార్డులు చేయవు కానీ అందరి నుంచి ఒక చక్కని స్పందన వస్తుంది అదే అతని తరువాత సినిమాకు గ్రీన్ సిగ్నల్ అవుతుంది. ఇంకా ఒక స్టార్ హీరోలా కమర్షియల్ కథలపై పడకుండా.. కొత్త రకం కథలనే ఎంచుకుంటున్నాడు. ఇప్పుడు తన రాబోతున్న సినిమా ‘యుద్ధం శరణం’ సినిమా కూడ ఫ్యామిలి - లవ్ రెండు ఉండే ఒక సాధారణ ఫ్యామిలి డ్రామాను కొంచెం వైవిధ్యం గా చెప్పబోతున్నాడు.
ఈ మధ్యనే యుద్ధం శరణం ఫస్ట్ లుక్ కూడ విడుదల చేశారు చిత్ర యూనిట్. ఆ పోస్టర్ కు మంచి స్పందనే వచ్చింది. ఇప్పుడు మరో పోస్టర్ విడుదల చేసారు యుద్ధం శరణం టీమ్. ఈ సారి విడుదల చేసిన ఈ పోస్టర్ లో టిజర్ ఎప్పుడు విడుదలకాబోతుంది అని చెబుతూ టైటిల్ డిజైన్ లోనే ఏదో కథను చెప్పే ప్రయత్నం చేశారు. పోస్టర్ లో ఉన్న వ్యక్తులు బట్టి చూస్తే ఒక కుర్రాడికి చక్కని కుటంబం ఉంది అమ్మ నాన్నతో బలమైన అనుభంధం ఉంది. అలానే ఒక లక్ష్యం కూడా ఉంది. ఇలాంటి కుర్రాడికి అవసరమైన ప్రేమ కూడా ఉందనే ఉంది. అయితే ఈ ప్రేమ కుటంబ ప్రయాణంలో అతనికి కొన్ని అడ్డంకులు కూడా ఉన్నాయి అనిపిస్తుంది. శ్రీకాంత్ అండ్ మురలి శర్మ ఆ అడ్డంకులు సృష్టిస్తే.. రావు రమేశ్ మరియు రేవతిలు బహుశా నాగ చైతన్య అమ్మ నాన్నలుగా నటించబోతునట్లు అర్ధం చేసుకోవచ్చు. మరి అతని లక్ష్య సాధనలో కొన్ని మలుపులు వలన శ్రీకాంత్ తో తలపడివలిసి వస్తుంది కాబోలు. పోస్టర్ బ్యాక్ గ్రౌండ్లో ఇంటి స్థలం కోసం వేసే ప్లాన్ కూడా ఉంది పెన్సిల్ డ్రాయింగ్తో. అంటే మనవాడు సివిల్ ఇంజినీరింగ్ కాబోలు. ల్యాండ్ గొడవలు లలో ఏదైనా సమస్య వచ్చి యుద్ధం చేస్తాడని అని మనం అనుకోవచ్చు. ఒక లావణ్య తో ప్రేమాయణం మరో యాంగిల్ అయితే.. అతను గాల్లోకి ఎగరేసే ఫ్లయ్ క్యామ్ అసలు సినిమాకే కీలకమైన యరో యాంగిల్. ఏదైనా కూడా సినిమా కొంచం కొత్తగానే ఉండబోతుందని అర్ధమవుతోంది. ఒక కుటంబం - ఒక అమ్మాయి ప్రేమ - ఒక లక్ష్యం - యుద్దం చేయడానికి ఒక శత్రు సైన్యం సరిపోతాయి అనే అనిపిస్తుంది.
రారాండోయి వేడుక చూద్దాం తరువాత నాగ చైతన్య నటిస్తున్న ఈ యుద్ధం శరణం సినిమాను సాయి కొర్రపాటి వారాహి చలన చిత్రం బేనర్ పై నిర్మిస్తున్నాడు. కృష్ణ ఆర్ వి మరైముత్తు డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ నెల జూలై 31 నాడు సినిమా టీజర్ విడుదలవ్వబోతోంది. అది సంగతి.