ఓవర్సీస్ మార్కెట్.. ఈ మధ్య తెలుగు సినిమాలకు భలే కలిసొచ్చేస్తోంది. ఇంతకుముందు అసలు మీద కొసరులా ఉండేవి అక్కడి కలెక్షన్లు. ఇప్పుడు కథ వేరుగా ఉంది. ఈ మధ్యే విడుదలైన ‘భలే భలే మగాడివోయ్’ సినిమా మీద పెట్టుబడి మొత్తం ఓవర్సీస్ మార్కెట్ లోనే వచ్చేయడం విశేషం. ఓవర్సీస్ లో ఖర్చులు ఎక్కువ.. చివరికి మిగిలే షేర్ వసూళ్లలో సగమే ఉంటుందన్నది వాస్తవం. అయినప్పటికీ వసూళ్లు భారీగా ఉంటే.. షేర్ కూడా అదే స్థాయిలో ఉంటుంది కాబట్టి సినిమా సినిమాకూ అక్కడ స్క్రీన్స్ పెరిగిపోతున్నాయి. ‘భలే భలే..’ లాంటి చిన్న సినిమాను వందకు పైగా లొకేషన్లలో రిలీజ్ చేశారు. సినిమాకు మంచి టాక్ రావడంతో వసూళ్లు అంచనాల్ని మించిపోయాయి. ఇప్పటికే రూ.9 కోట్ల దాకా కలెక్షన్లు కొల్లగొట్టిందా సినిమా. నాని సినిమాకు ప్రీమియర్ షోలు కూడా బాగానే పడ్డాయి.
ఇప్పుడు ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ విషయంలోనూ యుఎస్ లో సేమ్ స్ట్రాటజీ అనుసరిస్తున్నారు. సాయిధరమ్ తొలి రెండు సినిమాలకు 50 స్క్రీన్ లు కూడా ఇవ్వలేదు. కానీ సుబ్రమణ్యం..ను వందకు స్క్రీన్ లలో రిలీజ్ చేస్తున్నారు. హరీష్ శంకర్ మీద ఓవర్సీస్ ఆడియన్స్ కు మంచి అంచనాలుండటం కూడా కలిసొస్తోంది. అంచనాలు భారీగా ఉండటంతో 63 లొకేషన్లలో ‘సుబ్రమణ్యం’ ఫర్ సేల్ ప్రీమియర్ షోలు వేస్తుండటం విశేషం. బడా స్టార్లకు మాత్రం ఈ స్థాయిలో ప్రీమియర్లు వేస్తారు. మొన్న కిక్-2కి కూడా ఇంత హంగామా లేదు. ఐతే మిగతా స్టార్ హీరోల సినిమాలకున్నట్లు రేట్లు భారీగా లేవు. ప్రీమియర్ షో టికెట్ ధర 12 డాలర్లే. ఇది అక్కడ చిన్న మొత్తమే. కాబట్టి ప్రీమియర్ షోలు కళకళలాడిపోవడం ఖాయమంటున్నారు. సినిమాకు మంచి టాక్ వస్తే.. ‘సుబ్రమణ్యం ఫర్ సేల్’ మిలియన్ క్లబ్ లో చేరడం లాంఛనమే.