టాలీవుడ్ లో అగ్ర హీరోలు టాప్ డైరెక్టర్లతో పని చేశాడు ఎస్.ఎస్.థమన్. 2003 నుంచి ఇండస్ట్రీలో కొనసాగుతున్నాడు. ఈ రెండు దశాబ్ధాల్లో ఎన్నో బ్లాక్ బస్టర్లకు చార్ట్ బస్టర్ పాటల్ని ఇచ్చాడు. అయితే అతడి పేరు ఎన్నోసార్లు కాపీ క్యాట్ వివాదాల్లోకి వచ్చింది.
అయితే అన్నిటికీ సమాధానమిస్తూ.. ఇటీవల ఎంతో పరిణతితో మ్యూజిక్ ఇస్తున్న తీరును గమనించారా? ఈ మార్పు ఎవరి వల్ల సాధ్యమైంది? అన్నదానికి అతడే సమాధానమిచ్చారు. తాను కెరీర్ లో ఎందరు దర్శకులతో పని చేసినా కానీ 2018లో త్రివిక్రమ్ తో పరిచయం మొదలయ్యాక అంతా మారిపోయిందని థమన్ అన్నారు. అరవింద సమేతకు పని చేశాక తన తీరుతెన్నులు అమాంతం మారిపోయాయని థమన్ చెబుతున్నారు. త్రివిక్రమ్ తన సంగీతాన్ని మార్చేవారని .. ఆయన ప్రతిదీ అందంగా వివరించి చెప్పారని కూడా అన్నారు. ఇక తన జీవితంలో త్రివిక్రమ్ ఒక భాగం అని కూడా అన్నారు. ఈ నాలుగేళ్లలో ఆయన పరిచయం ఎంతో మార్చేసిందని ఆనందం వ్యక్తం చేశారు. థమన్ చెబుతున్నదానిలో నిజం కనిపిస్తోంది. అరవింద సమేత ట్యూన్లు ఆకట్టుకున్నాయి. అలాగే అల వైకుంఠపురములో చిత్రంతో అంతా మార్చేసి చూపించాడు. అల పాటలు ఎప్పటికీ ట్రెండ్ సెట్టర్స్ గా నిలిచిపోయాయి.
ఇటీవల పెద్ద సినిమాలకు పని చేస్తున్నా.. చిన్న చిత్రాల్ని వదిలి పెట్టలేదని స్క్రిప్టు నచ్చితే పారితోషికం కూడా తీసుకోకుండా పని చేస్తానని చాలా కాలంగా ఇలానే చేస్తున్నానని కూడా థమన్ తెలిపారు. లఘు చిత్రాలు... వెబ్ సిరీస్ లకు కూడా పని చేస్తానని నచ్చితే డబ్బులు అడగనని కూడా థమన్ అన్నారు. స్పోర్ట్స్ జోనర్ కి పని చేయడం తన కల అని అలాంటివాటితో మరింతగా నిరూపించుకునే వీలుంటుందని థమన్ అన్నారు.