రామ్ చరణ్ - ఎన్టీఆర్ కథానాయకులుగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్.ఆర్.ఆర్ లో కన్నడ నటుడు సుదీప్ నటిస్తున్నారని కొద్ది రోజులు గా సోషల్ మీడియాలో కథనాలొస్తున్న సంగతి తెలిసిందే. గత రెండ్రోజులుగా ప్రముఖ మీడియాలు .. టీవీ చానెళ్లలో ఇవే వార్తలు. మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీలో సుదీప్ ఎంట్రీపై ప్రత్యేక కథనాలు వేడెక్కించాయి. సుదీప్ ఈ చిత్రంలో ఓ బ్రిటీష్ పోలీస్ అధికారి పాత్రలో నటిస్తున్నాడని... స్క్రిప్ట్ అయినా వినకుండానే రాజమౌళిపై నమ్మకంతో ఒకే చెప్పాడని జోరుగా ప్రచారమైంది. సుదీప్ ఎంట్రీ రాజమౌళికి ఓ సెంటిమెంట్ అని కొందరు అడ్వాన్స్ డ్ గా కథలు అల్లేశారు.
ఈనెల 20 నుంచి ప్రారంభం కానున్న కొత్త షెడ్యూల్ లో కిచ్చా జాయినవ్వడమే అలస్యం.. అంటూ సాక్షాత్తు యూనిట్ ఈ విషయాన్ని రిలీవ్ చేసినట్లు గా మీడియా ప్రచారం చేసింది. తాజాగా ఈ కథనాలపై సుదీప్ స్పందించారు. ఆర్.ఆర్.ఆర్ టీమ్ నుంచి తనకు ఎలాంటి పిలుపు రాలేదని...రాజమౌళి గానీ...అతని బృందం కానీ తనను సంప్రదించలేదని వివరణ ఇచ్చారు. ఇలాంటి వార్తలు మళ్లీ రిపీట్ చేయోద్దని మీడియాని కోరాడు. దీంతో ఇది ఫేక్ ప్రచారమని తేలిపోయింది.
గతంలో సుదీప్ రాజమౌళి దర్శకత్వం వహించిన ఈగ - బాహుబలి చిత్రాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాలతో తెలుగులో బాగా పాపులర్ అయ్యాడు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా నరసింహారెడ్డి చిత్రంలో ఓ కీలక పాత్ర పోషించి మెగాభిమానులకు చేరువయ్యాడు. తాజాగా ఆర్.ఆర్.ఆర్ ఫేక్ ప్రచారంతో సుదీప్ పేరు మరోసారి టాలీవుడ్ లో మీడియాలో హాట్ టాపిక్ అయింది.