దర్శకధీరుడు రాజమౌళి సినిమా అంటే కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ ఉండాల్సిందేనా? ఇది జక్కన్నకు ఓ సెంటిమెంట్ అనే భావించాలా? అంటే అవుననే తాజా సన్నివేశం చెబుతోంది. రామ్ చరణ్- ఎన్టీఆర్ కథానాయకులుగా జక్కన్న ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ మల్టీస్టారర్ తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. వరుసగా పాన్ ఇండియా కేటగిరీలో సినిమాలు తీస్తున్న దర్శకధీరుడు ఇప్పటికే ప్రతి సినిమాలో కిచ్చా సుదీప్ కి అవకాశం ఇస్తున్నారు. ఇప్పుడు ఆర్.ఆర్.ఆర్ కి సేమ్ సెంటిమెంట్ రిపీట్ చేస్తున్నాడా? అంటే అవుననే చెబుతున్నారు.
తాజాగా ఆర్.ఆర్.ఆర్ లోని రెండు ప్రధాన పాత్రలకు ధీటుగా జక్కన్న మరో పాత్రను హైలైట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో పోలీస్ అధికారి పాత్రకు కన్నడ నటుడు కిచ్చి సుదీప్ ని రంగంలోకి దించుతున్నారు. జక్కన్న సుదీప్ ను సంప్రదించగానే మారు మాట్లాడకుంటా ఒకే చెప్పేసారుట. స్టోరీ లో అందులో తన పాత్ర గురించి వివరాలు సైతం అడగకుండా సుదీప్ ఒకే చెప్పారని తెలుస్తోంది. అంటే జక్కన్నపై సుదీప్ కు ఎంత నమ్మకమో అర్ధమవుతోంది. గతంలో రాజమౌళి తెరకెక్కించిన ఈగ- బాహుబలి చిత్రాల్లో సుదీప్ కీలక పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే.
వాటితో సుదీప్ కు తెలుగులో మంచి పేరొచ్చింది. ఆ రెండు సినిమాలు కూడా పెద్ద విజయాలు సాధించాయి. అందుకే మరోసారి సుదీప్ ని జక్కన్న సెంటిమెంట్ గా ఫీలై ఆర్.ఆర్.ఆర్ కోసం రంగంలోకి దించుతున్నాడన్న కొత్త ప్రచారం తెరపైకి వస్తోంది. జనవరి 20 నుంచి హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్ లో తారక్-చరణ్ మధ్య కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు. మరి ఈ షెడ్యూల్ లో సుదీప్ జాయిన్ అవుతాడా? తదుపరి షెడ్యూల్ కి కాల్షీట్లు కేటాయించాడా? అన్నది తెలియాల్సి ఉంది. ఇందులో చరణ్ మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో...తారక్ తెలంగాణ పోరాట యోధుడు కొమరం భీమ్ పాత్రలను పోషిస్తున్నారు. రెండు పాత్రలు ఆద్యంతం రక్తి కట్టించనున్నాయి. బ్రిటీష్ వారి గుండెల్లో రైళ్లు పరిగెట్టించిన రియల్ హీరోలు ఆ ఇద్దరూ. చివరికి తెల్లదొరల తూటాలకు అమరవీరులై చరిత్రకెక్కారు. ఇక వీరితో పాటు సుదీప్ పాత్ర సరిగ్గా కుదిరితే సినిమా స్పాన్ పెరుగుతుందనడంలో సందేహం లేదు.