ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా యూవీ క్రియేషన్స్ వారు నిర్మించిన చిత్రం రాధే శ్యామ్. భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా ప్రారంభం అయ్యి చాలా కాలం అయినా కూడా సరైన సమయంలో అప్ డేట్స్ ఇవ్వడం లేదు.. చాలా స్లో గా షూటింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి అంటూ ఎప్పటికప్పుడు ప్రభాస్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తూనే వస్తున్నారు.
సాహో విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధే శ్యామ్ ఇప్పటి వరకు విడుదల కాకపోవడంకు నిర్మాతల అలసత్వం కారణం అంటూ ప్రభాస్ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ వారి ఆలస్యంకు తోడు కరోనా వల్ల మరో ఏడాది కాలం పాటు సినిమా ఆలస్యం అయ్యిందని మొత్తంగా రెండేళ్లుగా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నామని అయినా కూడా రావడం లేదు.. కనీసం అప్డేట్స్ అయినా ఇవ్వడం లేదు అంటూ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సంక్రాంతికి విడుదల అంటున్నారు. అయినా కూడా ఇప్పటి వరకు సినిమా ఫస్ట్ సాంగ్ ను విడుదల చేయలేదు. దాంతో అసలు ఏం జరుగుతోంది అంటూ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. సూసైడ్ నోట్ ఒకటి తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో యూవీ క్రియేషన్స్ వారే నా చావుకు కారణం.. వారు రాధే శ్యామ్ అప్ డేట్స్ సరైన సమయంకు ఇవ్వక పోవడం వల్లే తాను మానసికంగా కృంగిపోయాను.
అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా అందులో పేర్కొన్నారు. ఇంకెప్పుడు అభిమానుల ఫీలింగ్స్ తో కూడా ఆడుకోవద్దంటూ యూవీ క్రియేషన్స్ వారికి సీరిస్ గా అందులో వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఆ సూసైడ్ నోట్ వైరల్ అవ్వడంతో యూవీ క్రియేషన్స్ వారిలో కాస్త కదలిక వచ్చినట్లుగా ఉంది.
ఇన్ని రోజులుగా రాధే శ్యామ్ ఫస్ట్ పాట కోసం ఎదురు చూస్తున్న అభిమానుల కోరిక తీర్చడం కోసం ఈనెల 15న మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. రాధే శ్యామ్ మొదటి పాట విడుదల కు సంబంధించిన ప్రకటన ఏ క్షణంలో అయినా యూవీ క్రియేషన్స్ నుండి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే మొదటి పాట విడుదలకు సిద్దం అయ్యింది. సౌత్ భాషల్లో ఒక వర్షన్.. హిందీ భాషలో ఒక వర్షన్ ను విడుదల చేయబోతున్నారు. ఇలాంటి ప్రయోగం చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. సినిమా ఒక్కటే అయినా కూడా పాటలు వేరు వేరు ఉండటం ఖచ్చితంగా ఒక అద్బుత విషయం అన్నట్లుగా చెబుతున్నారు. పాటల విడుదల అయితే ఇక సినిమా సందడి మొదలు అయినట్లుగా భావిస్తారు. అందుకే రాధే శ్యామ్ మొదటి పాట కావాల్సిందే అని అభిమానులు పెద్ద ఎత్తున డిమాండ్ చేశారు. వారి డిమాండ్ నెరవేరబోయే సమయం వచ్చేసింది. 15వ తారీకున రాధే శ్యామ్ పాట వస్తుందని అంటున్నారు.