సుకుమార్ ఏ వేడుకకు వచ్చినా తనకు మాట్లాడటం తెలియదంటూనే చాలా ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తుంటాడు. జూనియర్ ఎన్టీఆర్ గురించి ‘నాన్నకు ప్రేమతో’ సమయంలోనే భలే మాట్లాడాడు సుక్కు. తాజాగా ‘జై లవకుశ’ థియేట్రికల్ ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో భాగంగా ఎన్టీఆర్ గురించి తనదైన శైలిలో కామెంట్ చేశాడు సుక్కు. ఎన్టీఆర్ ఒక నట సముద్రం అని.. అందులోంచి తాను.. కొరటాల శివ ఒక్కో బకెట్ తీసుకున్నామని.. ఐతే ‘జై లవకుశ’ డైరెక్టర్ బాబీ మాత్రం ఏకంగా ఒక ట్యాంకు తీసుకెళ్లిపోయాడని అన్నాడు సుకుమార్.
‘జై లవకుశ’ చూశాక ఎన్టీఆర్ అభిమానుల్లో చీలిక వచ్చి కొట్టేసుకుంటారేమో అని సందేహం వ్యక్తం చేశాడు సుక్కు. ఈ సినిమాలో జై.. లవ.. కుశ అంటూ మూడు పాత్రలున్నాయని.. ఈ పాత్రలు మూడింటికీ వేర్వేరుగా అభిమాన వర్గాలు ఏర్పడి.. ఎన్టీఆర్ అభిమానులే ఒకళ్లతో ఒకళ్లు గొడవపడతారేమో అని అన్నాడు సుక్కు. మూడు పాత్రలూ చేసింది ఎన్టీఆరే అన్న గుర్తుంచుకోవాలని సుకుమార్ చమత్కరించాడు.
ఇక ఈ వేడుకకు వచ్చిన మరో అతిథి కొరటాల శివ మాట్లాడుతూ.. ‘జై లవకుశ’లో తాను ఒక పాట చూశానని.. దానికి అద్భుతమైన సెట్టింగ్స్ వేశారని.. ఇంకా అనేక ఆకర్షణలు ఉన్నాయని.. కానీ పాట చూస్తున్నపుడు తనకు ఏమీ కనిపించలేదని.. ఎన్టీఆర్ మాత్రమే కనిపించాడని.. అతను ఈ పాటలో డ్యాన్స్ కుమ్మి పడేశాడని అన్నాడు. తన సినిమా ‘జనతా గ్యారేజ్’లో కూడా ఎన్టీఆర్ ఇలా డ్యాన్స్ చేయలేదని చెప్పాడు కొరటాల.
ఇంకో అతిథి వి.వి.వినాయక్ మాట్లాడుతూ.. ఎన్టీఆర్ ఏ సినిమాకైనా ముందు ప్రిపేర్ అయ్యేదంటూ ఏమీ ఉండదని.. నేరుగా సెట్ కు వచ్చేసి అప్పటికప్పుడు అలా నటించేస్తుంటాడని.. కానీ ‘జై లవకుశ’ మొదలవడానికి ముందు మాత్రం ప్రి ఆక్యుపైడ్ గా కనిపించాడని.. దీని గురించి అతను టెన్షన్ పడ్డాడని.. ముందే ప్రిపేరయ్యాడని.. జై టీజర్ చూశాక అతనెందుకు టెన్షన్ పడ్డాడో.. ఎందుకంత ప్రిపేరయ్యాడో తనకు అర్థమైందని చెప్పాడు. తమ కలయికలో ‘అదుర్స్-2’ ఉంటుందని వినాయక్ అన్నాడు.