సుందరంతో శేఖర్‌ మాస్టర్‌ సందడి

Update: 2022-02-17 01:30 GMT
నాని ఇటీవలే శ్యామ్‌ సింగ రాయ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా మంచి విజయాన్నిసొంతం చేసుకుంది.

నాని ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా అంటే సుందరానికి సినిమా ను మొదలు పెట్టాడు. యంగ్‌ డైరెక్టర్ వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతుంది. నాని ఇప్పటి వరకు చేసిన పాత్రల్లో ఈ పాత్ర చాలా విభిన్నంగా ఉండబోతున్నట్లుగా ఫస్ట్‌ లుక్ ను చూస్తేనే అర్థం అవుతుంది.

అంటే సుందరానికి సినిమా లో నానికి జోడీగా మలయాళి బ్యూటీ నజ్రియా హీరోయిన్ గా నటిస్తుంది. తమిళంలో పలు సినిమాల్లో నటించి సక్సెస్ ను దక్కించుకున్న ఈ అమ్మడు డబ్బింగ్‌ సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలు.

 పుష్ప సినిమాలో ఇటీవల కనిపించి మెప్పించిన ఫాహద్ ఫాజిల్‌ భార్య ఈ నజ్రియా అనే విషయం తెల్సిందే. తెలుగు లో నానితో ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ అమ్మడు స్టార్‌ డమ్ దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుంది.

నాని తన ప్రతి సినిమా ను సాగతీసినట్లుగా కాకుండా జెట్‌ స్పీడ్ తో షూటింగ్‌ ను పూర్తి చేస్తున్నాడు. అంతటి భారీ శ్యామ్‌ సింగరాయ్ సినిమానే కేవలం మూడు నాలుగు నెలల్లోనే పూర్తి చేసినట్లుగా సమాచారం అందుతోంది.

 కనుక అంటే సుందరానికి సినిమా కూడా అతి త్వరలోనే పూర్తి అవ్వడం ఖాయం అనిపిస్తుంది. తాజాగా శేఖర్ మాస్టర్ ఆధ్వర్యంలో ఈ సినిమాలోని పాట షూటింగ్ నిర్వహించారు.

ఈమద్య కాలంలో ట్రెండ్‌ అవుతున్న శేఖర్‌ కమ్ముల ఈ పాటను ట్రెండీ లుక్ లో నాని మరియు నజ్రియాతో కంపోజ్‌ చేసినట్లుగా తెలుస్తోంది. పాట షూటింగ్‌ సందర్బంగా తీసుకున్న ఫోటోలను షేర్ చేసి సినిమాపై ఆసక్తి పెంచారు.

 నాని ఎల్లో లుంగీ కట్టుకుని నల్ల షర్ట్‌ ధరించి డిఫరెంట్‌ స్టైల్ లో కనిపిస్తున్నాడు. తప్పకుండా ఈ పాట సినిమాలో కీలకంగా ఉంటుందని అనిపిస్తుంది.

ఇక నజ్రియా లుక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. నాని మరియు నజ్రియాలు కలిసి స్టెప్పులు ఈ కాస్ట్యూమ్స్ తో వేస్తే కలర్‌ ఫుల్ గా ఉండే అవకాశం ఉంది.

 కనుక సినిమా లో ఈ పాట ప్రధాన ఆకర్షణగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. నాని లోని ఫుల్‌ కామెడీ యాంగిల్ ను ఈ సినిమాలో దర్శకుడు వెలికి తీస్తాడని అంటున్నారు. ఒక వైపు ఈ సినిమా షూటింగ్‌ చేస్తూనే మరో వైపు దసరా షూటింగ్ ను కూడా మొదలు పెట్టాడు.

నాని హీరోగా రూపొందబోతున్న దసరా సినిమాకు సంబంధించిన రెగ్యులర్ షూటింగ్‌ కూడా చకచక జరగనుందట. నాని జోరు చూస్తుంటే ఇతర యంగ్‌ హీరోలు ఒకటి రెండు సినిమాలు విడుదల చేయడానికే కష్టపడుతుంటే ఈ ఏడాది నాని నుండి కనీసం మూడు సినిమాలు అయినా వచ్చే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుంది. ఇది నాని అభిమానులకు ఖచ్చితంగా గుర్తుంచుకోదగ్గ సంవత్సరంగా నిలుస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News